పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా నిలుస్తున్న సీఎం కేసీఆర్…

Spread the love

138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ..


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంకు చెందిన 138 మంది లబ్ధిదారులకు రూ. 1,38,16,008 విలువ చేసే కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లికి పెద్దన్నగా మారి ‌ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నారని అన్నారు. ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే పేదరికం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితులను టీఆర్ఎస్ ప్రభుత్వం తొలగించిందని పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంతో రూ.100116 కట్నంగా అందించి పేదల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ , మంత్రి కేటీఆర్ నూతన ఆలోచనలతో రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధిలో ముందుకు సాగుతుందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కమలాకర్, మఖ్సూద్ అలీ, గౌసుద్దీన్, సిద్ధిక్, శ్రీశైలం, లబ్ధిదారులు మరి వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..

Related Posts

You cannot copy content of this page