వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

MLA KP Vivekanand paid tribute to Veeranari Chakali Ailamma…

వీర‌నారి చాక‌లి ఐల‌మ్మ‌కు నివాళుల‌ర్పించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…


*సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జగద్గిరిగుట్ట, రాజీవ్ గాంధీనగర్ లలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ (చిట్యాల ఐల‌మ్మ‌) వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజాం పాలనకు, విసునూరు దేశ్‌ముఖ్ పాల‌న‌కు వ్యతిరేకంగా పోరాడిన యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. చాకలి ఐలమ్మ ధైర్యం, తెగువ.. ఆనాటి దేశ్‌ముఖ్‌లు, రజాకార్ల గుండెల్లో భయం పుట్టించాయ‌న్నారు. ఒకవైపు సాయుధ పోరాటం చేస్తూనే మరోవైపు అమ్మలా ఉద్యమకారులకు అన్నం పెట్టిన‌ మహనీయురాలు చాకలి ఐల‌మ్మ అని ఎమ్మెల్యే కీర్తించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక డివిజన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page