సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని కుత్బుల్లాపూర్ గార్డెన్ కాలనీ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని సభ్యులు తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఉప్పల హరివేణు గోపాల్, వైస్ ప్రెసిడెంట్లు శ్రీరామ్, శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీల అభివృద్ధి : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
Related Posts
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా?
SAKSHITHA NEWS తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని చంపేయాలని చూస్తున్నారా? ఏఐసీసీ నేతలపై జగ్గారెడ్డి ఫైర్ అధికారంలో ఉన్న పార్టీ ఉండేది ఇలాగేనా? ఇంచార్జీలు పార్టీని చంపేయాలని చూస్తున్నారు ఇంతకు ఏఐసీసీ కార్యదర్శులు ఉన్నారా? వేరే రాష్ట్రం వెళ్ళిపోయారా? దీపాదాస్ మున్షీ ఉందా?…
పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం
SAKSHITHA NEWS పిల్లలకు సరైన ఫుడ్ పెట్టండి.. మంత్రి సీతక్క ఆగ్రహం నాణ్యత లేని సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్లకు నోటీసువ్వాలని మంత్రి సీతక్క ఆదేశాలు అంగన్వాడీ చిన్నారులకు సరఫరా చేసే బాలామృతం ముడి సరుకుల్లో నాణ్యత లోపాన్ని సహించం నాసి…