*-ప్రజల జీవన పరిమాణాలకు అనుగుణంగా జగనన్న లేఅవుట్లు అభివృద్ధి చేస్తు, మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నాం….
గుడ్లవల్లేరు05:మండల కేంద్రమైన గుడ్లవల్లేరు జగనన్న హౌసింగ్ కాలనీలో జల్ జీవన్ మిషన్ నిధులు కోటి 64 లక్షల నిధులతో చేయునున్న రక్షిత మంచినీటి సరఫరా పథకం మరియు పైప్ లైన్ ద్వారా ఇంటింటికీ కుళాయి ఏర్పాటు చేయుటకు నిర్మాణ పనులను ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు.తొలుత కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే కొడాలి నానికు కాలనీ నివాసితులు స్వాగతం పలికారు. అనంతరం జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ప్రజా ప్రతినిధులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించినఎమ్మెల్యే నాని, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ స్వర్గీయ వైయస్సార్ హయంలో సేకరించిన 30 ఎకరాల భూముల్లో 940 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు ఇచ్చామన్నారు. ప్రజల అవసరాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సహకారంతో నాలుగు ఎకరాలు సేకరించి మరో 160 మంది లబ్ధిదారులకు ఫ్లాట్లు ఇచ్చామన్నారు. ఇప్పటికే 550 మందికి పైగా లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారన్నారు. త్రాగునీటి వసతితో పాటుగా కాలనీలో ప్రజల జీవనానికి ఇబ్బందులేకుండా అవసరమైన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని, రోడ్ల అభివృద్ధికి 15 లక్షల నిధులు ఇప్పటికే మంజూరు చేశామన్నారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీపీ సురేష్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుక్కిపాటి శశిభూషణ్, పాలేటి చంటి, ఉప్పాల రాము, గుడ్లవల్లేరు మండల వైసీపీ బూత్ కమిటీల ఇన్చార్జ్ కోటప్రోలు నాగు, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్ పెన్నేరు ప్రభాకర్, దుగ్గిరాల శేషుబాబు,సోషల్ మీడియా కన్వీనర్ గుదే రవి,అల్లూరి ఆంజనేయులు,చెబత్తిన నాని,మేకల అనిల్, స్థానిక కాలనీ నివాసితులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.
,,,,,,,,,,,,,,