SAKSHITHA NEWS

పథకం ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి విద్యార్థుల అపూర్వ స్వాగతం

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార (సీఎం బ్రేక్‌ఫాస్ట్‌) పథకాన్ని గోల్నాక డివిజన్లోని లంక ప్రభుత్వ పాఠశాలలో అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ప్రారంభించి, విద్యార్థులతో కలిసి బ్రేక్‌ఫాస్ట్‌ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, మానవీయ కోణంలో పేద విద్యార్థుల కోసం సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్లోని 1 నుండి 10వ తరగతి విద్యార్థుల భవితకు వరం లాంటిదని తెలిపారు. ఇలాంటి అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్ కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు.
ప్రతి రోజు వేర్వేరు రకమైన ఉపాహారం తీసుకోవడం వలన, పిల్లల శారీరక, మానసిక వికాసానికి చక్కటి మార్గం ఏర్పడి, వారు చదువులో చురుకుగా తయారై, మంచి భవితను అందుకుంటారని తెలిపారు

లంక ప్రభుత్వ పాఠశాలలో పథకం ప్రారంభించడానికి విచ్చేసిన ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సమక్షంలో విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి, నృత్యాలు ప్రదర్శించి అపూర్వ స్వాగతం పలికారు. ఎమ్మెల్యే విద్యార్థులను ఆశీర్వదించి, వారి ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ కోట శ్రీవాత్సవ్ , డిప్యూటీ ఈవో శ్రీమతి విజయలక్ష్మీ , కార్పొరేటర్లు శ్రీమతి దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ , శ్రీమతి పద్మా వెంకట్ రెడ్డి , విజయ్ కుమార్ గౌడ్ , విద్యా శాఖ అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 10 06 at 2.31.30 PM

SAKSHITHA NEWS