ప్రీ స్పోర్ట్స్ మీట్” కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం…

Spread the love
MLA invited to attend as chief guest at Pre-Sports Meet program

ప్రీ స్పోర్ట్స్ మీట్” కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం…


సాక్షిత : ఫిట్నెస్ పై అవగాహన కల్పిస్తూ ‘ఫిట్టెస్ట్ ఆఫ్ తెలంగాణ‘ అనే పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్నాచ్ ఫిట్నెస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న “ప్రీ స్పోర్ట్స్ మీట్”లో భాగంగా ఆదివారం జీడిమెట్ల గ్రామంలోని టీఎన్ఆర్ గార్డెన్స్ లో ఉదయం 8:00 గంటల నుండి నిర్వహించనున్న కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరు కావాలని స్నాచ్ ఫిట్నెస్ వారు ఎమ్మెల్యే ని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా ఫిట్నెస్ పై దృష్టి సారించాలన్నారు. ఆరోగ్యకరమైన జీవనం వైపు యువత అడుగులు వేయాలన్నారు. స్నాచ్ ఫిట్నెస్ వారు చేపడుతున్న “ప్రీ స్పోర్ట్స్ మీట్”లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోచ్ సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page