టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని.. 150 స్కూళ్లకు చెందిన ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారం ఉషోదయ కాలనీలో గల ట్రస్మా భవనంలో ట్రస్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీచర్స్ డే వేడుకల్లో భాగంగా ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మండలంలోని సుమారు 150 పాఠశాలలకు చెందిన ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ భవిష్యత్తు టీచర్ల చేతిలోనే ఉందని అన్నారు. నేటి బాలలను రేపటి భావి భారత పౌరులుగా తయారు చేయాల్సిన బాధ్యత టీచర్లపైనే ఉందని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో విద్యార్థులకు విద్యను అందించేందుకు కృషి చేసిన టీచర్లను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, ప్రధాన కార్యదర్శి జే.నాగరాజు, బాచుపల్లి మండల అధ్యక్షుడు సాంబ శివనారాయణ, గండిమైసమ్మ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్, కుత్బుల్లాపూర్ మండల అధ్యక్షుడు వనజ అశోక్, ట్రెజరర్ నర్సిరెడ్డి, రామ్ బాబు, పుష్ప, కార్యక్రమ దాత గుంజ శ్రీనివాస్, ఐలయ్య మరియు స్థానిక సీనియర్ నాయకులు రషీద్ బైగ్, నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, ఏజీపీ కమలాకర్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, నాయకులు, పాఠశాలల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
టీచర్స్ డే వేడుకల్లో పాల్గొని.. 150 స్కూళ్లకు చెందిన ఉత్తమ టీచర్లను ఘనంగా సన్మానించిన ఎమ్మెల్యే…
Related Posts
నటి జెత్వానీ కేసు: విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న తీర్పు
SAKSHITHA NEWS నటి జెత్వానీ కేసు: విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 16న తీర్పు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నటి జెత్వానీ కేసు కుక్కల విద్యాసాగర్ బెయిల్ పిటిషన్‌పై విజయవాడ కోర్టులో విచారణ విద్యాసాగర్‌కు బెయిల్ ఇవ్వొద్దని…
కాంగ్రెస్-బిఆర్ఎస్ పవర్ పాలిటిక్స్ వేదికగా లగచర్ల
SAKSHITHA NEWS కాంగ్రెస్-బిఆర్ఎస్ పవర్ పాలిటిక్స్ వేదికగా లగచర్ల? సిఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో లగచర్లలో జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్ తదితరులపై కర్రలు, రాళ్ళతో గ్రామస్తులు దాడి చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ వ్యవహారంలో…