నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్

Spread the love

MLA GMR started the Nuttala medicine distribution program

నట్టల మందు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎంఆర్


సాక్షిత : గొర్రెలు, మేకల కాపర్లు తప్పనిసరిగా జీవాలకు నట్టల మందులు వేయించాలని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అమీన్పూర్ మండల పరిధిలోని సుల్తాన్పూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గొర్రెలకు నట్టాల మందు పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జిఎంఆర్ లాంచనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి సంవత్సరం మూడు సార్లు ఉచితంగా నట్టల మందు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ మందు ద్వారా జీవాలలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. గొర్రెలు, మేకలు కలిగిన రైతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page