పెద్దపల్లి నియోజకవర్గం…కంటి వెలుగును సందర్శించిన ఎమ్మెల్యే దాసరి

Spread the love


MLA Dasari visited Peddapally Constituency…Kanti Velak

పెద్దపల్లి నియోజకవర్గం…కంటి వెలుగును సందర్శించిన ఎమ్మెల్యే దాసరి


సాక్షిత : పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం సుల్తానాబాద్ మండలకేంద్రంలో సుగ్లంపల్లి (రాములపల్లి) గ్రామంలో ప్రజలకు కంటి పరీక్షలను వైద్యుల బృందం నిర్వహించారు

శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టారని ప్రజలు ఎవరు కంటి సమస్యలతో బాధపడవద్దని లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు

ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు గతంలో పాలనలో ఉన్న ఏ ప్రభుత్వాలు ఇలాంటి మహోత్సరమైన కార్యక్రమాల్ని చేపట్టలేదని ముఖ్యమంత్రి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజల ఆరోగ్య సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఆసుపత్రులలో చికిత్స పొందిన వారికి ఎల్ ఓ సి లను అందిస్తూ వారి ఆరోగ్యాన్ని కాపాడుతున్నారని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందిస్తూ కుటుంబంలో పెద్దకొడుకుల వ్యవహరిస్తున్నారన్నారు

రానున్న రోజుల్లో మరిన్ని సేవ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడమే ముఖ్యమంత్రి లక్ష్యమని పేర్కొన్నారు అనంతరం పలువురు కంటి పరీక్షలు నిర్వహించుకున్న వారికి మందులు అద్దాలను అందించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, కౌన్సిలర్ లు పసెడ్ల మమత-సంపత్, గుర్రాల శ్రీనివాస్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సాజిద్ వైద్యులు డాక్టర్ మధుకర్ రెడ్డి, శ్రీజ, పురుషోత్తం, హెచ్ ఇ ఓ శ్రీనివాస్ రెడ్డి, ANM లు, ఆశా వర్కర్లు,మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్ రమేష్, ఆర్ పి లు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page