రైఫిల్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన అఖిలను అభినందించిన ఎమ్మెల్యే…

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని బీజేఆర్ నగర్ కు చెందిన వనమాల అఖిల ఇటీవలే జరిగిన రాష్ట్ర స్థాయి 10 మీటర్ల రైఫిల్ ఛాంపియన్‌షిప్, సీఎం కప్ లలో బంగారు పతకాలను సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అఖిలను శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకుడు జల్ద లక్ష్మీనాథ్ మరియు అఖిల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page