రైతులకు అండగా బీఆర్ఎస్ ప్రభుత్వం – ఎమ్మెల్యే చిరుమర్తి

Spread the love

చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో పీఏసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన నాణ్యమైన ధాన్యాన్ని దళారులను ఆశ్రయించి నష్టపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి నేరుగా తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. ధాన్యంలో తేమశాతం 17 కు మించకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.


రైతులకు అన్ని సంక్షేమ పధకాలను అందిస్తూ రైతుల మన్నలను పొందుతున్న ఏకైక ముఖ్యమంత్రి కెసిఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జడల ఆది మల్లయ్య, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కూరెళ్ళ లింగస్వామి, సింగిల్ విండో చైర్మన్ సుంకరి మల్లేష్ గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, కౌన్సిలర్స్ బెల్లి సత్తయ్య, జిట్ట పద్మ బొందయ్య, నాయకులు వనమా వెంకటేశ్వర్లు, పొన్నం లక్ష్మయ్య, జగని బిక్షం రెడ్డి, జిట్టా చంద్రకాంత్, సిలువేరు శేఖర్, జయారపు శివప్రసాద్, షీలా సత్యనారాయణ, చిత్రగంటి ప్రవీణ్, నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page