మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

Spread the love

మంత్రి హరీశ్ రావును కలిసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

— రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి నూతన భవనం, వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చెయ్యాలని వినతి

నల్లగొండ సాక్షిత ప్రతినిధి

తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖమాత్యులు తన్నీరు హరీష్ రావు ని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కలిశారు. మంత్రి హరీశ్ రావు నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే చిరుమర్తి కలిసి నకిరేకల్ నియోజకవర్గంలోని పలు పెండింగ్ పనుల గురించి వివరించారు. రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థలో ఉన్నదని, నూతన భవనానికి నిధులు మంజూరు చేసి, వంద పడకల ఆసుపత్రిగా అప్ గ్రేడ్ చెయ్యాలని మంత్రి హరీశ్ రావు ని ఎమ్మెల్యే చిరుమర్తి కోరారు.

Related Posts

You cannot copy content of this page