వినుకొండ పట్టణంలోని 29వ వార్డులో జరిగిన గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలసి వార్డులోని ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు….
ఈసందర్భంగా ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, ప్రజలకు సంక్షేమ పథకాలను చేరువ చేస్తున్న వాలంటీర్లను అభినందించారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి ఇప్పటికే రెండు లక్షల ముప్పది ఒక్క వేల కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమం రూపంలో అందించారన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ వారిని పేదరికం నుంచి బయటకు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహనరెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారన్నారు. పట్టణంలో కనీసం రోజుకు రెండు బిందెలు నీరు కావాలన్నా అర్ధరాత్రి వరకు వేచి ఉండే రోజులు పోయి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ మంచినీరు ఇస్తున్నామని తెలిపారు.
పట్టణానికి సమీపంలో మార్కాపురం రోడ్డులో లారీ అసోసియేషన్ వారికి ఆరు ఎకరాలు, ఆపక్కనే ఆటోనగర్‌కు పది ఎకరాలు రిజిష్టరు చేసి ఇవ్వడం జరిగిందన్నారు. మీడియా వారికి 2సెంట్లు చొప్పున 100మందికి పైగా స్థలాలు ఇచ్చామని, సుగాలీలకు నంగారాభేరి సేవాలాల్ తరపున దేవాలయం నిర్మించుకునేందుకు 30సెంట్లు, బ్రాహ్మణ కల్యాణ మండపానికి 10సెంట్లు, అపరకర్మల భవనానికి 50సెంట్లు స్థలాన్ని ఇచ్చామన్నారు. పట్టణానికి సమీపంలో ఎస్టీ గురుకుల పాఠశాల నిర్మాణానికి 5 యకరాలు భూమి కేటాయించి నిర్మాణం ప్రారంభించినట్లు తెలిపారు. జడ్పీ బాలికోన్నత పాఠశాల అదనపు గదుల నిర్మాణం రెండు యకరాల్లో జరుగుతుందన్నారు. ముస్లింలకు ఐదు యకరాల గురుకుల పాఠశాల కాలేజీ, హాస్టల్ నిర్మాణ పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని చెప్పారు.
100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించామని, రూ.100కోట్లు నిధులతో త్వరలో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమవుతుందన్నారు. పదిహేను కోట్ల రూపాయలు ట్రామాకేర్ సెంటర్‌కు ప్రభుత్వం విడుదల చేసిందని ఎమ్మెల్యే బొల్లా తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ముసుగు వేసుకొని తిరుగుతూ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అభివృద్ధి పనులు బాగా చేశాడు కదా మీరు ఎవరికి ఓటు వేస్తారని ప్రశ్నించడం వింతగా ఉందన్నారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును మధ్యంతర బెయిల్‌పై విడుదల చేస్తే స్వీట్లు పంచుకొని టపాకాయలు కాల్చుకునే వారికి ఈనెల 24వ తేదీన తిరిగి చంద్రబాబునాయుడు జైలుకు వెళ్లాలనే విషయం తెలియదా అని ప్రశ్నించారు. వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఆనందంగా జీవితం కొనసాగిస్తున్నారన్నారు. ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే వాడే నాయకుడని ఎమ్మెల్యే బొల్లా అన్నారు. ఈకార్యక్రమంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్‌ఛైర్మన్లు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు….