నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన అందరికి అందుబాటులోకి తాత్కాలిక భవనం - మేయర్ శిరీషా సాక్షిత : తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని తాత్కాలిక భవనంలోకి మారుస్తున్న సందర్భంగా బుధవారం తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి, కార్పొరేటర్లు, అధికారుల సమక్షంలో తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం వున్న ప్రాంతంలో సిటి ఆఫరేషన్ సెంటర్ ను నిర్మించడం జరుగుతున్నదని, మరో 18 నెలల పాటు మెటర్నటి ఆసుపత్రి ప్రాంగణంలోని భవనంలో తాత్కాలికంగా నగరపాలక సంస్థ కార్యాలయం నిర్వహణ వుంటుందన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలించి తాత్కాలికంగా నగరపాలక సంస్థ కార్యాలయం నిర్వహించుకునేందుకు మెటర్నటి ప్రాంగణంలోని పాత డి.ఎం.అండ్ హెచ్.ఓ కార్యాలయాన్ని కేటాయించడం జరిగిందన్నారు. అనుకున్న సమయంలోపు సిటి ఆపరేషన్ సెంటర్ పనులు పూర్తి చేయించి నగరపాలక సంస్థ నూతన భవనంలోకి వెల్లడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్టాండింగ్ కమిటి సభ్యులు ఎస్.కె.బాబు, కార్పరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, శేఖర్ రెడ్డి, హనుమంత నాయక్, తిరుపతి మునిరామిరెడ్డి, అమరనాధ రెడ్డి, రేవతి, బసవ గీత, నరేంద్రనాధ్, శ్రావణిమునిరామిరెడ్డి, శైలజా, దూది కుమారి, ఇమామ్, రుద్రరాజు శ్రీధేవి, అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, సెక్రటరీ రాధికారెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంధ్రరెడ్డి, దేవిక, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతుమాధవ్, ఏసిపిలు షణ్ముగం, బాలసుబ్రహ్మణ్యం, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.
నగరపాలక సంస్థ తాత్కాలిక భవనాన్ని
Related Posts
జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి
SAKSHITHA NEWS జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ * సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గంఆంధ్రప్రదేశ్…
వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం
SAKSHITHA NEWS వైభవంగా శ్రీ సాయిబాబా మందిరం వార్షికోత్సవం వందలాది మందికి అన్నదానం ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు విజయవాడ నగరంలోని అజిత్ సింగ్ నగర్ ఆంధ్రప్రభ కాలనీలో కొలువై ఉన్న శ్రీ షిర్డీసాయిబాబా మందిరం 16వ వార్షికోత్సవం…