పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామం నుంచి ఆలేరు వెళ్ళే దారిలో ఉన్న వాగుపై 4 కోట్ల 15 లక్షల నిధులతో బ్రిడ్జి నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి .
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాలు ప్రగతి పథంలో నడుస్తున్నాయని అన్నారు, గతంలో లేనివిధంగా ప్రశాంతమైన వాతావరణంలో పల్లెల్లో పాలన సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు.
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది అని అన్నారు,
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి అని అన్నారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మా చిరకాల కోరిక నెరవేరిందని, ఇక్కడ బ్రిడ్జి లేక ఎంతో మంది ప్రమాదాలకు గురయ్యారని ప్రత్యేక చొరవ తీసుకొని మాకు బ్రిడ్జి మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపిన ప్రజలు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు ప్రజాప్రతినిధులు,అధికారులు బిఆర్ఎస్ నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.