Minister Satyavati Rathore visited Preeti, a medical student undergoing treatment at NIMS
నిమ్స్ లో చికిత్స పొందుతున్న మెడికో విద్యార్థిని ప్రీతిని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్
సాక్షిత : విద్యార్థిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్న మంత్రి*
ప్రీతికి మెరుగైన వైద్య చికిత్స అందించాలంటూ వైద్యులు ఆదేశించిన మంత్రి*
ప్రీతి తల్లి తండ్రులతో మాట్లాడి వారిని ఓదార్చిన మంత్రి*
హైదారాబాద్ నిమ్స్ హాస్పటల్ చికిత్స పొందుతున్న పీజీ వైద్య విద్యార్థిని ప్రీతిని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ పరామర్శించారు.*
అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ….
వైద్య విద్యార్థిని ప్రీతి సంఘటన బాధాకరం.
ప్రీతీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది.
ఎక్మా,డయాలసిస్ ల సాయంతో ప్రీతీకి చికిత్స కొనసాగుతోంది
ప్రీతీ కళ్ళు తెరిచి చూడగలుగుతుంది, స్వత హాగా ఊపిరి తీసుకోగలుగుతుంది.
ప్రత్యేక వైద్య బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
MGM లో ర్యాగింగ్ ఘటనపై
ప్రభుత్వం కమిటీని నియమించింది.
ఘటన కారకులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు.
దోషులు ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటాం.
ముఖ్య మంత్రి ఆదేశాలతో నిమ్స్ వైద్యులకు ఆదేశాలు ఇచ్చి అన్ని రకాలుగా ప్రీతిని కాపాడే ప్రయత్నం చేస్తున్నాం.
తల్లిదండ్రుల చేత మాట్లాడిస్తున్నపుడు ప్రీతీ రెస్పాండ్ అవుతుంది.
ప్రీతి కుటుంబానికి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది.