ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

Spread the love

ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లి కేషన్లు డబుల్ బెడ్‌ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు.

నిరుద్యోగులు కూడా ఎక్కు వ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు.

మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఆటో వాళ్లు తమ సోదరులే అని..వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమస్య పరిష్కరించేవరకు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page