తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి పొన్నం ప్రభాకర్
రానున్న వేసవి అధికంగా ఉష్ణోగత్రలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ నేప థ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కమిషనర్ రొనాల్డ్ రోస్, కలెక్టర్ అనుదీప్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, జోనల్ కమిషనర్లు, అధి కారులతో కలిసి హైదరా బాద్ నగర అభివృద్ధి, సమస్యలపై ఆయన తొలిసారిగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో ప్రజలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూసుకోవా లని జలమండలి అధికారు లను ఆదేశించారు.
వేసవిలో తాగునీరు సక్రమంగా సరఫరా కాని ప్రాంతాలను ముందుగానే గుర్తించి సరఫరా చేయాలని సూచించారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టి సమస్యలను పరిష్క రించాలని ఆదేశించారు.