గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం
వైద్య ,ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
మెదక్ జిల్లా రేగోడు మండలo గ్రామాలలో పర్యటన*175 లక్షల తో వివిధ నిర్మాణాలకు శంకుస్థాపన
సాక్షిత మెదక్ ప్రతినిధి:
తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం అని, గ్రామాల అభివృద్ది వల్ల ప్రజల జీవితాలలో మార్పులు వస్తాయనీ రాష్ట్ర వైద్య ఆరోగ్య,శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు.స్థానిక మెదక్ జిల్లా లోని రేగొడ్ మండలం, టీలింగంపల్లి, మర్పల్లి,ఆర్ ఇటిక్యాల, జగిర్యల లలో ప్రజలతో ,దళిత కాలనిల లో తిరుగుతూ వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖు స్థాపన చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మట్లాడుతూ రేగొడు మండలాల్లోని వివిధ గ్రామాల అభివృద్ది కార్యక్రమాలు అయినా త్రాగునీరు,మురుగు నీటి కాల్వలు,సీసీ రోడ్లు,ఇతర గ్రామాలలో భవనాల నిర్మణాల కోసం 175 లక్షల రూపాయలతో వివిధ నిర్మాణాలకు శంఖు స్థాపన చేశారు.దళిత కాలనీలలో తిరుగుతూ సమస్యలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు.దళితుల కాలనీలలో త్రాగునీరు,మురికి కాలువ లు, విద్యుత్ స్తంభాల ల సమస్యలు పరిష్కరిస్తామ న్నారు.ధరణి తీసివేసిన తర్వాత భూమి సమస్యలు తీర్చి ,భూమి పై హక్కులు కల్పిస్తామని చెప్పారు.
ఆడ పిల్లలకు ఆర్థిక సహాయం రేగొడు మండల కేంద్రం లో దళిత కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశం లో రమేష్ అని వ్యక్తి తనకు బార్య చనిపోయిందని ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని ,గత ప్రభుత్వంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేస్తే రాలేదని ,మంత్రి కి మొరపెట్టుకున్నాడు.మంత్రి దామోదర రాజనర్సింహ మానవతా దృక్పథంతో ఇద్దరు ఆడపిల్లలకు ఒక్కోరికీ 50 వేల చొప్పున ఇద్దరికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తానని మానవతా దృక్పథంతో హామీ ఇచ్చారు. ఇద్దరు ఆడపిల్లల తండ్రి రమేష్ సంతోషం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు చదువు ఆయుధం,మెదక్ జిల్లా రేగొడు మండలం లో ఉన్న కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, మోడల్ స్కూల్,కళాశాలలో జరిగిన సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు.ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ ఆడపిల్లలకు చదువు ఆయుధం అన్నారు.చదువు తో సంస్కారం అలవడుతుందన్నా రు.మంచి నడవడి ,మంచి ఆలోచనలు చదువు ముఖ్యం అన్నారు.చదువుకొని సమాజం లో బాధ్యతగా ఉండాలన్నారు. ప్రశ్నిచడం అనేది చదువు వల్ల వస్తుందన్నారు.మాత్రు భాషలో ప్రేమతో ఉండాలన్నా రు.ఇతర భాషలను గౌరవించాలని,సబ్జెక్ట్ ల పై పట్టు సాధించాలన్నారు. కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల లో మౌలిక సదుపాయాల కొసం 85 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ వేంకటేశ్వర్లు,డీఈఓ రాధా కిషన్,మెదక్ ఆర్డీఓ అంబాదాస్ రాజేశ్వర్,జడ్పిటిసి యాదగిరి, స్థానిక ప్రజాప్రతినిధులు, సిబ్బంది,తో పాటు తదితరులు పాల్గొన్నారు.