మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్.

Spread the love

మీడియాతో మంత్రి కేటీఆర్ చిట్ చాట్…..

• కాళేశ్వరం, మిషన్ భగీరథ, 24 గంటల ఉచితంగా కరెంటు ఇవ్వచ్చని ఈ దేశంలో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి వ్యవసాయం దండగ కాదు పండుగ అని స్వల్ప సమయంలో నిరూపించిన వ్యక్తి కేసీఆర్
• రైతుల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గిన రాష్ట్రం తెలంగాణ. ఈ మాట భాతర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది. నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో చెప్పింది
• రైతులకు ఇంత అద్భుతమైన పథకాలు రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, రైతు సమితీలు ఎక్కాడా లేవు
• ఈ పథకాలతో మన రైతులు పంజాబ్, హర్యాణా రైతులతో తెలంగాణ రైతులు పోటీ పడుతున్నారు.
• హరిత విప్లవం తో పంజాబ్ , హర్యానా రైతులు దేశానికి అండగా ఉన్నారు. అలాంటి వారితో మన రైతులు పోటీపడుతున్నారు.
• ఇంటింటికి తాగునీరు ఇవ్వడం పెద్ద విషయం. తెలంగాణ సాధన పెద్ద విషయం కాదని ఎలా కొంతమందికి అనిపిస్తుందో అట్లనే. 75 ఏళ్లలో ఎవరూ చేయని పని తెలంగాణలో కేసీఆర్ గారు చేశారు. ప్రతీ ఇంటికి శుద్దిచేసిన తాగునీరు ఇస్తున్న ఏకైక రాష్ట్రంమని పార్లమెంట్ లో భారత ప్రభుత్వం ప్రకటించింది.
• 5 దశాబ్దులుగా తెలంగాణలో అపరిష్కతంగా ఉన్న ఫ్లోరైడ్ సమస్యను మేం పరిష్కరించినం.
• ఉద్యమ కాలంలో మరిగూడ మండలం ఖుదాభక్ష్ పల్లి అనే ఊరులో ఫ్లోరైడ్ బాదితులను చూస్తే మనసుకు బాధ అనిపిస్తుంది.
• 8 ఏళ్ల కింద తెలంగాణలో పవర్ సమస్య ఎలా ఉందో ఒకసారి గుర్తు చేసుకోండి.
• పార్లమెంట్ లో భారత ప్రభుత్వం మిషణ్ భగీరథ తో తెలంగాణ ఫ్లోరోసిస్ ఫ్రీ అని భారత ప్రభుత్వం ప్రకటించింది.
• ఇవన్నీ దేశానికి రోల్ మోడల్ లాంటివి.
• కాలియా రైతుబంధు స్పూర్తితో క్రిషిబంధు బెంగాల్ పీఎం కిసాన్ లాంటి పథకాలు రైతుబంధు స్పూర్తితో వివిధ రాష్ర్టాల్లో వచ్చాయి.

బిజెపి, ప్రధానిపై నిప్పులు

• గోల్ మాల్ గుజరాత్ మోడల్ ను చూపెట్టి అధికారంలోకి వచ్చి ఈ 8 ఏళ్లలో ఏం చేశారు.
• మోస్ట్ ఇన్ కాంపీటింట్ , ఇన్ ఎఫిషియంట్, ప్రచార్ మంత్రి స్వతంత్ర భారతంలో మొదటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.
• దివాళాకోరు, పనికిరాని ప్రధాని మోడీ.
• మీడియా వెన్నుముక్క లేదు. ఆయన ప్రెస్ మీట్ పెట్టడు. జన్ కీ బాత్ వినడు. మన్ కీ బాత్ మాత్రమే చెప్తడు. బిల్డప్ తప్ప పనేం లేదు.
• 45 సంవత్సరాల్లో అత్యధిక నిరుద్యోగం దేశంలో ఉంది
• దేశంలో వికాస్ ఎక్కడ తప్పిపోయింది. అచ్చే దిన్ ఆయేంగే పతా నహీ
• ఒక్క మనిషి కే అచ్చే దిన్. దునియాలోనే ధనవంతుడు
• 2022 వరకు అందరికి ఇళ్లు ఇస్తా అన్నడు. కాని 435 కోట్లతో ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుంటున్నడు.
• ఈ దేశంలో అత్యధిక ద్రోవ్యోల్బణం, అత్యధిక నిరుద్యోగం, ప్రపంచంలో అత్యధిక గ్యాస్ రేటు, నైజీరియాను ఇండియా పూర్ కంట్రీ అవుతోందని రిపోర్టులు వస్తున్నాయి
• ఈ ప్రభుత్వం ప్రతీ రంగంలో విఫలం అయింది.
• భారత్ రాష్ట్ర సమితి రూపంలో ఈ సమస్యలకు మేం పరిష్కారం చూపిస్తాం.
• ప్రతీ ఒఖ్కరికి తాగునీటిని అందిస్తాం. ఉచితంగా కరెంటు అందిస్తాం. దళితులను వ్యాపారవేత్తుల చేస్తాం.
• ఎవరు ఏం తింటున్నారు. ఎవరు ఏం ధరించాలి. అన్నవి మాత్రమే చర్చకు వస్తున్నాయి.
• బిజెపి ఫెడరల్ స్పూర్తి ని దెబ్బతీసింది.
• సెప్టెంబర్ 17 ను లిబరేషన్ డే అయితే అగష్టు 15 ఎందుకు లిబరేషన్ డే కాదు. విమోచనం కాదు.
• బ్రిటీష్ వాళ్లు చేసిన అరాచకాలను ఎర్రకోట మీది నుంచి మోడీ ఎందుకు మనం ప్రశ్నించం.
• రాజకీయ భావదారిద్రం కోసం ఆడే చిల్లర నాటకం ఇది.
• రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా దండయాత్ర చేసినట్టు ఏక్ నాథ్ షిండే, బొమ్మై లు వచ్చారు

భారత్ రాష్ట్ర సమితిపై కెటియార్

• ఈ దేశంలో ప్రతీ ఒక్కరూ సమానం. కేసీఆర్ గారు మా పార్టీ పేరును భారతరాష్ట్ర సమితిగా మార్చమని మా పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసినం. ఈసీ కి పంపినం. అదోక రాజ్యాంగ బద్దసంస్థ. అది తన నిర్ణయాన్ని తీసుకుంటుందని మేం భావిస్తున్నాం.
• కేసీఆర్ గారు 8 నెలల నుంచి దేశంలోని వివిధ రాజకీయా నాయకులు, రైతులు, ప్రజాసంఘాలు, ఆర్థిక వేత్తలతో మాట్లాడినంకనే జాతీయ స్థాయిలోకి వెళ్లాలని నిర్ణయించినం. ఏంఏం సమస్యలు ఉంటాయో మాకు తెలుసు.
• ఇప్పుడే ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికలు మా టార్గెట్.
• అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లో చేసిన పని చూసి పంజాబ్ ,లో అధికారంలో కి వచ్చిండు. అట్లనే మేం చేస్తం. మా పని పక్కనున్న మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో మాకు పాజిటివ్ ఉంది. కర్నాటకలో కుమారస్వామి గారితో కలిసి పోటీ చేస్తం.
• కర్నాటక, మహారాష్ట్ర సర్పంచులు కూడా అడుగుతున్నరు. వీళ్లందరు తెలంగాణ మోడల్ ప్రయోజనాలు చూస్తున్నరు. పొందుతున్నారు..తెలంగాణలో కలుపమని కోరుతున్నారు.
• మా ఇంపాక్ట్ పక్క రాష్ట్రాల్లో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో పోటీ చేయడం తప్పదు.
• కేసీఆర్ గారిని అవహేళన చేసినవాళ్లతంతా ఇవాళ చీకట్లో కలిసిపోయారు.
• అధికారం కోసమో పదవుల కోసమో కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం లేదు.
• ఈ దేశంలో ఒక దారుణమైన పరిస్థితి ఉంది.
• మా మీద దాడులు, కుట్రలు ఉంటయి. వాటన్నింటిని ఎదుర్కుంటున్నం. వ్యవస్థలను ఎలా ఉపయోగించుకుంటారో మాకు తెలుసు.
• ఈడీ, సీబీఐ లు ప్రతిపక్షాలనే టార్గెట్ చేస్తున్నాయి. మహారాష్ట్రలో ఎన్సీపీ , శివసేన, కాంగ్రెస్ నేతలను టార్గెట్ చేసిన్రరు
• మోడీ అండ్ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు. వాటన్నింటిని ఎదుర్కుంటం. వారి బాగోతాలను మొత్తం బయటపెడతం.
• విలువలు లేని రాజకీయం చేస్తున్న బీజేపీ వలువలు ఇప్పుతం..
• మోడీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల లాగా ఈడీ, ఐటీ, సిబిఐను ఉపయోగించుకుంటారు.
• ఈసీ చెప్పకముందే బీజేపీ వాళ్లు ఎలక్షన్ డేట్ లు ప్రకటిస్తారు. ఈడీ చెప్పకముందే బీజేపీ లీడర్లు ఈడీ దాడుల గురించి చెపుతారు.
• ఒక్క బీజేపీ నాయకుడిపై అయినా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా?
• సుజనాచౌదరీ, సిఎం రమేష్ ల పై కేసులు పెట్టి పార్టీలో చేర్చుకున్నరు. కేసులతో భయపెట్టి లొంగదీసుకోవాలనుకుంటే వారి అమాయకత్వం. కేసీఆర్ గారికి దమ్ముంది.
• 2024 లోక్ సభ ఎన్నికలే మా టార్గెట్.
• గోల్ మాల్ గుజరాత్ మోడల్ ను ఎక్స్ పోజ్ చేయడమే మా స్ట్రాటజీ. ఏ అంశాలు చర్చకు రావాలో వాటినే పెడతం. మహారాష్ట్ర ,కర్నాటకలో ఇవే చెపుతుం
• తెలంగాణలో జరుగుతున్న పనిని సమర్థవంతంగా దేశానికి చెపుతాం. మాకంత నేర్పు, ఓర్పు ఉంది. మేం చేసిన పని చూపెట్టి ఓట్లు అడిగినం.
• ఒకటిన్నర సంవత్సరాల్లో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తమని చెప్పడం లేదు.
• బీజేపీ సొంతంగా అధికారంలోకి రావడానికి 40 ఏళ్లు పట్టింది. మాకు అంత టైం పట్టకపోవచ్చు.
• అధికారమే పరమాశది కాదు మాకు, ప్రజలకు ఏం కావాలో అవే అజెండా.
• కేసీఆర్ గారు తెలంగాణ….సినానిమస్ మమ్మల్ని తెలంగాణ పార్టీ అంటరు.
• సబ్జెక్ట్ ఉన్న తెలుగు సినిమాలు పాన్ ఇండియా అట్లనే మా పార్టీలో కంటెంట్ కటౌట్ ఉంది. మాకు విజయం దక్కుతుంది.
• రైతుబంధు, దళితబంధు గురించి తెలుసుకుని నిన్న వచ్చిన నేతలు ఆశ్చర్యపోతున్నారు.

రాహుల్ గాంధీ భారత్ జోడో కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చెయ్యాలి

• ఆయన ఏం చేసిన ఒక పక్కా వ్యూహం ఉంటుంది. ఇవాళ దేశంలో రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది.
• రాహుల్ గాంధీ భారత్ జోడ్ కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చెయ్యాలి. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ముక్కలవుతుంది. ఆయన యాత్ర చేస్తుంటే గోవాలో ఉన్న ఎమ్మెల్యేలు బీజేపీ లో చేరారు.
• తెలంగాణలో ఎన్ని రోజులైనా యాత్ర చేసుకోవచ్చు.
• తెలంగాణలో ఉన్న పరిస్థితి రాహుల్ గాంధీ కి అర్థం అవుతుంది. మిషన్ భగీరథ, కరెంటు, హరితవనాలు
• కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చేస్తోంది. రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్నప్పుడే తెలంగాణ ఎంపీలు ఆ పార్టీని వదిలిపెట్టే అవకాశం ఉంది.
• వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం లేదు. పార్టీ అధ్యక్షుడు ఓడిపోయాడు. అలాంటి పార్టీ గురించి మాట్లాడుకోవడం వేస్ట్..
• తెలంగాణలో ఒకరిద్దరు ఎంపీ లు కాంగ్రెస్ ను విడిచిపోతారని వింటున్నాను.
• కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయింది. రాజకీయ శూన్యత ఈ దేశ రాజకీయాల్లో ఉంది.

మునుగొడు ఉపఎన్నికలపై కెటియార్

22 వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ రాజగోపాల్ కంపెనీకి ఇచ్చిన తరువాతనే సుశీ ఇన్ప్రా కి అందులో మిగిలే పైసల కోసమే రాజగోపాల్ గారు తన పదవిని పణంగా పెట్టి బీజేపీలో పోయిండు.
• అమిత్ షా ను కలిసిన ఓ పెద్దమనిషి నన్ను కలిసిండు. రాజగోపాల్ 500 కోట్లు ఖర్చు పెడతానని అమిత్ షా చెప్పిండు.
• ఓటుకు 30 వేలు ఇచ్చి అయిన గెలుస్తా అన్న రాజగోపాల్ రెడ్డి చెపుతున్నడు. కాంట్రాక్టర్ బలుపుకు మునుగోడు ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నిక ఇది.
• 30 శాతం ఓట్లు మాకు ఎక్కువ ఉన్నయి
• మేం మునుగోడులో గెలిసినం. రెండు, మూడు స్థానాలకు పోటీ గట్టిగా ఉంది. బీజేపీ కాంగ్రెస్ మధ్య

ఇతర అంశాలపై కెటియార్

• హిందూ ముస్లీం పొలరైజేషన్ చిచోరా చిల్లర్ మాటలు మోహన్ భగవత్ వి. వాటిని పట్టించుకోము.
• ఈ దేశ భవిష్యత్తు యువతదే…
• ఒక్క ఎన్నిక గెలవని మోహన్ భగవత్ ను కౌన్సిలర్ గా గెలవమని చెప్పండి చూద్దాం.
• 2014 లో ముఖ్యమంత్రిగా మోడీ దేశవ్యాప్తంగా 100 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కేసీఆర్ కూడా అంతే.
• కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ మోడల్ ను దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తరు. సేమ్ ఇదే పాలనను దేశ ప్రజలకు వాగ్దానం చేస్తారు.
• మీ ఫోన్ లలో పెగాసస్ ఉంది. పదివేల మందికి పైగా వ్యక్తుల పోన్ లలో పెగాసస్ ఉంది.
• నా ఫోన్ లో కూడా పెగాసెస్ ఉంది. మా విషయాలన్నీ తెలసుకుంటున్నరు.
• కిషన్ రెడ్డి గారి ఫోన్ ను మోడీ ట్యాప్ చేస్తున్నరు. ఆ విషయం పాపం ఆయనకు తెలియదు.

Related Posts

You cannot copy content of this page