సర్వేపల్లి లో రైతుల ఆప్యాయత, అనురాగాల మధ్య సాగిన మంత్రి కాకాణి ప్రచారం”

Spread the love

మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన పొదలకూరు మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, బత్తులపల్లి, నేదురుమల్లి, వెలికంటిపాలెం గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి”

“కోలాటాలు, తప్పెట్లు, మహిళల మంగళ హారతులు, బాణాసంచా కాల్పులు, గజమాలలు, డప్పు వాయిద్యాలు, రైతుల ఆప్యాయత, అనురాగాల మధ్య అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం “

“సర్వేపల్లి లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి కాకాణి ని ప్రజలు ఆశీస్సులు అందించి 50 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించేందుకు సిద్ధం”

“మంత్రి కాకాణి రోడ్ షోలో భారీగా పాల్గొన్న జనం”

“మిగ్-జాం తుఫాన్ సమయంలో రికార్డు సమయంలో తెగిన కాలువలు పునర్నిర్మించి సమృద్ధిగా సాగునీరు అందించారు అంటూ మంత్రి కాకాణి కి ధన్యవాదాలు తెలియజేసిన రైతులు”

“రైతు అనేవాడు సాగునీటి కోసం ఆందోళన చెందవలసిన అవసరమే లేకుండా సమృద్ధిగా సాగునీరు అందించిన వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడు అంటూ మంత్రి కాకాణి ని అభినందనలతో ముంచెత్తిన రైతులు”

“గ్రామాలలో త్రాగునీటి కోసం ఇక్కట్లు పడే వారిమని.. గ్రామ గ్రామానా, వాడవాడలా మినరల్ వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేసి గ్రామాలలోని కుటుంబాలన్నింటికీ పరిశుభ్రమైన త్రాగునీరు అందించారంటూ మంత్రి కాకాణి కి కృతజ్ఞతలు తెలియజేసిన మహిళలు”

“తాము పుట్టి బుద్ధి ఎరిగిన తర్వాత ఇంత పెద్ద స్థాయిలో గ్రామాలలో అభివృద్ధి పనులు జరగడం ఇదే ప్రథమం అంటూ సంతోషాన్ని వెలిబుచ్చిన గ్రామస్తులు”

“గ్రామాలలో అభివృద్ధి పనులు చేపట్టి.. గ్రామాల ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిన మంత్రి కాకాణి కి సాధారణ మెజారిటీతో గెలిపించడం కాకుండా భారీ మెజారిటీతో 50 వేల పైచిలుకు మెజారిటీతో గెలిపించడమే మా లక్ష్యం అంటున్న సర్వేపల్లి ప్రజలు”

“సర్వేపల్లి నియోజకవర్గం లో గ్రామాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని పేర్కొన్న మంత్రి కాకాణి”

“గడిచిన ఐదేళ్లలో అసంపూర్తిగా ఉన్న అన్ని అభివృద్ధి కార్యక్రమాలపై ప్రధానంగా దృష్టి సారించామన్న మంత్రి కాకాణి”

“గ్రామాల్లో మౌలిక వసతులను మరింత మెరుగుపరిచామని పేర్కొన్న మంత్రి కాకాణి”

“ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా నెల్లూరు జిల్లాకు వచ్చినప్పుడు పొదలకూరు మండలంలో అనేకమందికి బోర్లు మంజూరు చేశామని ఇప్పటికే కొన్ని పూర్తి చేస్తామన్న మంత్రి కాకాణి”

“అర్హత కలిగిన రైతులందరికీ వైయస్సార్ జలకళ బోర్లు పూర్తి చేస్తామని తెలిపిన మంత్రి కాకాణి”

“పొదలకూరు మండలంలోని అనేక గ్రామాలకు గ్రావెల్ రోడ్లు, సిమెంట్ రోడ్ లను వేసామని.. మౌలిక వసతులు మెరుగుపరిచామని చెప్పిన మంత్రి కాకాణి”

“పొదలకూరు మండలం తమ సొంత మండలం అని మీ ఇంటి బిడ్డగా ఏ అవసరం వచ్చినా పలికే వాడినని పేర్కొన్న మంత్రి కాకాణి”

“తెలుగుదేశం పార్టీలో పనిచేసిన అనేకమంది వైసిపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా సంక్షేమ పథకాలతో ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని పేర్కొన్న మంత్రి కాకాణి”

“గ్రామాలు బాగుండాలి.. గ్రామాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో ఎటువంటి వివాదాలు లేకుండా నిరంతరం పని చేశామన్న మంత్రి కాకాణి”

“దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుందని, ఇన్నాళ్ల చరిత్రలో పొదలకూరు మండలానికి చెందిన వారు ఎప్పుడు మంత్రులుగా అవలేదని తానే తొలిసారిగా అయ్యానని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“పొదలకూరు ప్రజలకు ఏ అవసరం వచ్చినా ఇంటి బిడ్డగా నిరంతరం పలుకుతూ వారి సంక్షేమం, అభివృద్ధి కోసం మంత్రిగా నిరంతరం పనిచేశానని పేర్కొన్న మంత్రి కాకాణి”

“గడిచిన 5 ఏళ్ళలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరేలా సంక్షేమ పథకాలు అమలు చేశామన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు చేశామన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో గతంలో ఎంతోమంది శాసనసభ్యులుగా పని చేసినా ఎన్నడూ లేని విధంగా గ్రామ గ్రామానా పూర్తిస్థాయిలో సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలు, సాగునీరు, త్రాగునీరు వసతి కల్పించామన్న మంత్రి కాకాణి”

“రైతులకు చుక్కల భూముల సమస్యతోపాటు అసైన్మెంట్ భూముల పట్టాలు పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“అన్యాప్రాంతమైన భూములకు పట్టాలు, నోషనల్ ఖాతాలు తెరిపించడం, ఇనాం భూములకు పట్టాలు అందించడం లాంటి అనేక సమస్యలను పరిష్కరించి రైతుల భూములకు యాజమాన్య హక్కు పత్రాలను అందించామన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గంలో గడచిన ఐదు సంవత్సరాలలో వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి లో కరోనా కష్టకాలంలో ప్రజలను పట్టించుకున్న తెలుగుదేశం నాయకుడే కరువయ్యాడు అన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేసి వారిని ఆదుకున్నామని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కు అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రజల కోసం నిలబడ్డామని.. మృత్యువును సైతం ఎదుర్కొన్నామని తెలిపిన మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా రాలేదన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి మిల్లర్ ల దగ్గర 50 కోట్ల రూపాయలు ముడుపులు మింగి రైతుల నడ్డి విరిచాడన్న మంత్రి కాకాణి”

“రైతులు తమ ధాన్యాన్ని 12 వేల రూపాయలకు తెగ నమ్ముకుని తీవ్రంగా నష్టపోయారన్న మంత్రి కాకాణి”

రైతులు తమ ధాన్యాన్ని 22 వేల నుండి 24 వేల వరకు అమ్ముకుని సంతోషంగా ఉన్నారన్న మంత్రి కాకాణి”

“తెలుగుదేశం హయాంలో ధాన్యం ధరలు.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ధాన్యం ధరలను రైతులు గమనించాలన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి నీరు చెట్టు, రైతు రథం పేరిట అవినీతికి పాల్పడడం, రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం తప్ప సర్వేపల్లి అభివృద్ధికి ఒరగబెట్టింది ఏమి లేదు”

“ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే కాకాణి గోవర్ధన్ రెడ్డి రెడ్డి కి మీ ఆశీస్సులు అందిస్తారా.. ఎన్నికల అప్పుడు మాత్రమే కనపడే సోమిరెడ్డిని ఆదరిస్తారా ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి”

“చంద్రబాబు నాయుడును ప్రజలు ఏమాత్రం నమ్మరని.. హౌ మెనీ ఇచ్చి వాటిని విస్మరించడం చంద్రబాబుకు షరా మామూలేనన్ను మంత్రి కాకాణి”

“రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్న మంత్రి కాకాణి”

“వాలంటీర్ లు ఇళ్ల దగ్గరకు వెళ్లి పెన్షన్ లు ఇస్తుంటే చంద్రబాబు అడ్డుకున్నాడన్న మంత్రి కాకాణి”

“2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 4 విడతల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని ప్రశంసించిన మంత్రి కాకాణి”

“చెప్పి ఎగ్గొట్టే చంద్రబాబు కావాలా.. చెప్పినవి చెప్పినట్లుగా ఇంటికి చేర్చే జగన్ మోహన్ రెడ్డి కావాలా ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి కాకాణి”

“నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ని, తనను ఆశీర్వదించాలని కోరిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి

Related Posts

You cannot copy content of this page