“ప్రతి మహిళ ఆర్థికంగా బలోపేతం కావడమే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం” -మంత్రి కాకాణి
SPS నెల్లూరు జిల్లా:
తేది:01-04-2023
సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన “వై.యస్.ఆర్.ఆసరా” సంబరాల్లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
స్వయం సహాయక మహిళలు ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ లను సందర్శించిన మంత్రి కాకాణి.
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ…
👉 మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే, ఆ కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి సాధించి సంతోషంగా జీవిస్తాయని భావించిన ముఖ్యమంత్రి ప్రతి పథకంలోనూ మహిళలను భాగస్వామ్యులు చేస్తూ, వారికి ఆర్థిక భరోసా కల్పిస్తున్నారన్న మంత్రి కాకాణి.
👉 రాష్ట్రంలోని మహిళలను సొంత అక్కాచెల్లెళ్ళుగా భావిస్తూ, పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు స్వయం సహాయక సభ్యులకు ఆసరా 3వ విడత నిధులను సీఎం విడుదల చేస్తున్నారన్నారు.
👉 జిల్లాలోని 34,440 గ్రూపులకు 826 కోట్లు మంజూరు చేసామన్నారు. అందులో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,056 గ్రూపులకు 91 కోట్ల 83 లక్షలు నిధులు మంజూరయ్యాయన్నారు.
👉 ఇంత పెద్ద మొత్తంలో ఒక పధకానికి నిధులు కేటాయించడం గతంలో ఎన్నడూ లేదన్నారు.
👉 కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రెండు విడతలు మంజూరు చేసి, ఇప్పుడు మూడో విడత నిధులు మంజూరు చేశారన్నారు.
👉 మహిళలు కుటుంబాన్ని చక్కదిద్దటంలో ముఖ్య పాత్ర పోషిస్తారని, అటువంటి మహిళలకు ఆసరాగా ఉంటూ సహాయం అందచేస్తే అద్భుతాలు చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి పధకాన్ని మహిళల పేరుతోనే ముఖ్యమంత్రి అమలు చేస్తారన్నారు.
👉 మహిళల గురించి ఇంతలా ఆలోచించే ముఖ్యమంత్రి దేశంలోనే లేరని, వారిని ఆర్ధిక స్వాలంబన దిశ గా నడిపించుటకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు.
👉 ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని సద్వినియోగం చేసుకుని విభిన్న తరహా జీవనోపాధులు ఎంచుకుని ఆర్ధిక సుస్థిరత సాధించాలన్నారు.
👉 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలను విరివిగా ప్రోత్సహిస్తున్నామని, వీటి ద్వారా వారు జీవితం లో నిలదొక్కుకోవడమే కాకుండా మరింత మందికి ఉపాధి కల్పిస్తారన్నారు.