మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి నాగర్ కర్నూలు మెడికల్ కాలేజ్ ను సందర్శించిన వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ *
వైద్య కళాశాలకు సంబంధించి వచ్చే అకాడమిక్ సంవత్సరంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో మౌలిక వసతులు సమకూర్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉమ్మడి మహబూబ్ నగర్ ఇంఛార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు._
నాగర్ కర్నూల్ జిల్లాలోని వైద్య కళాశాల, మెడికల్ కళాశాలలను *రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు *, జిల్లాలోని శాసన సభ్యులు , జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి ఆకస్మికంగా సందర్శించారు. వైద్య కళాశాల నిర్మాణంలో ఉన్న భవనాన్ని పరిశీలించారు. ఎప్పటిలోగా భవనం పూర్తి అవుతుంది ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం కళాశాలలో ఉన్న మౌలిక వసతులు, వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. కొత్తగా ఏర్పడిన నాగర్ కర్నూల్ వైద్య కళాశాలలో వచ్చే అకాడమిక్ సంవత్సరంలో మరికొంత మంది వైద్య విద్యార్థులు కొత్తగా చెరనున్నందున విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సకాలంలో అవసరమైన మేరకు తరగతి గదులు, హాస్టల్ , ఇతర మౌలిక వసతులు ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్, కళాశాల ప్రిన్సిపాల్ తో సమన్వయం చేసుకొని టి.ఎస్.ఎం. ఐ.డి.సి, ఇంజనీరింగ్ అధికారులు సమన్వయం చేసుకుంటూ కళాశాలకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలన్నారు._
మెడికల్ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు.అంతకు ముందు జిల్లా ఆసుపత్రిని సందర్శించి అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలు, రోగులకు ఇస్తున్న వైద్య సదుపాయం, భోజనం,పారిశుధ్యం పరిశీలించారు.ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులో ఐ.సి.యు. యూనిట్, చిన్న పిల్లల ఎన్. ఐ.సి.యు. , జనరల్ వార్డులను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వైద్యం అందిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు.రోగులకు మెను ప్రకారం భోజనం అందించాలని, ఆసుపత్రిలో చాలా ఇరుకుగా ఉన్నందున వాటిని మెరుగు పరచడానికి నిధుల ఆవశ్యకత పై ఆలోచిస్తామన్నారు._
ఇక్కడ ట్రామా యూనిట్ కు అవసరమైన సిబ్బంది, నిధుల పై త్వరలో కార్యాచరణ చేపడతామని తెలిపారు._
ఆసుపత్రిలో అన్ని సాంకేతిక మిషనరీలు ఉన్నాయని కానీ ఐ.సి .యు. లో సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరత వల్ల పూర్తి స్థాయి వైద్యం అందటం లేదని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు._
స్పందించిన మంత్రి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలియజేశారు._
రాష్ట్ర ఆబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, స్థానిక శాసన సభ్యులు కే. శేఖర్ రెడ్డి, అచ్చంపేట శాసన సభ్యులు డా. వంశీ కృష్ణ, కల్వకుర్తి శాసన సభ్యులు కసిరేడ్డి నారాయణ రెడ్డి ఇతర, జిల్లా పరిషత్ చైర్మన్ శాంత కుమారి, కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, తదితరులు మంత్రి వెంట ఉన్నారు._