ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి చామకుర మల్లారెడ్డి

Spread the love

కేరళ రాష్ట్రం లోని త్రివేంద్రం హ్యత్ లో మే 24 తేదీ నుండి నుండి 26వ తేదీ వరకు జరుగుతున్న ఇంటర్నేషనల్ లేబర్ కాన్స్లవ్ 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రము తరుపున గౌరవ తెలంగాణ రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రివర్యులు శ్రీ చామకుర మల్లారెడ్డి గారు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మల్లారెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ రాక ముందు తెలంగాణ జిల్లాల నుండి చాలా మంది కార్మికులు ఇతర రాష్టాలకు వలస వెళ్లేవారు, కానీ ఇప్పుడు మన ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రము ఎంత అభివృద్ధి చెందిది అంటే దాదాపు 15 ఇతర రాష్ట్రాల నుండి కార్మికులు దాదాపు 25లక్షల మంది తెలంగాణ రాష్ట్రానికి వలస వస్తున్నారు. వచ్చిన
ప్రతి ఒకరికి ఇక్కడ పని లభిస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కలిస్తుంది. ప్రమాదశత్తు కార్మికుడు మరణిస్తే కార్మిక భీమా కింద 6లక్షలు అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కార్మికులు ప్రమాదశత్తు అంగవైకల్యం చెందుతే ఆర్థిక సహాయం అందజేస్తున్నాము. అలాగే కార్మికుల కూతురుల వివాహానికి, ప్రసుతికి ఆర్థిక సహాయం అందజేస్తున్నాము. వలస కార్మికులను సకల సౌకర్యాలు కల్పిస్తూ సొంత వాళ్లలాగా చూస్తున్న ప్రభుత్వం కెసిఆర్ ప్రభుత్వం.
కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు అన్నం పెట్టి, వారికీ వైద్య సహాయం అందించి సొంత ఖర్చులతో ట్రైన్ బస్సు ల ద్వారా వారికీ వారి వారి గమ్యాస్తానలకు పంపిన మంచి మనస్సు ఉన్న నాయకులు మా ముఖ్యమంత్రి కెసిఆర్ గారు.

కెసిఆర్, కేటీర్ గారి సారథ్యంలో పెద్ద పెద్ద పరిశ్రమలు, కంపెనీల యాజమాన్యలు తెలంగాణ రాష్ట్రములో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు.
24గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రము.

Related Posts

You cannot copy content of this page