ఘట్కేసర్ మండల ఎంపీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బహిరంగ లేఖ హైదరాబాద్ ఈస్ట్ గా పిలవబడే ఉప్పల్,బోడుప్పల్, పీర్జాదిగూడ, చెంగిచెర్ల, చర్లపల్లి,నారపల్లి,పోచారం, ఘట్కేసర్ ప్రాంతాలు ఐ.టి హబ్ గా ఇన్ఫోసిస్ సాఫ్ట్ వేర్ ఇతర కంపెనీలలో దాదాపుగా 25 వేల మంది ఉద్యోగాలు చేస్తున్నారు గత ప్రభుత్వంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి వివక్ష చూపడం వలన అభివృద్ధి చెందలేదు అర్బనైజేషన్ కారణంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, నల్గొండ, యాదాద్రి- భువనగిరి, ప్రాంతాల నుంచి ప్రజలు ఉద్యోగ, ఉపాధి కొరకు పట్నానికి వలస వచ్చి లక్షలాది ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు.దీంతో ఉప్పల్ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు దాటి ఘట్కేసర్ వరకు రోడ్లపై విపరీతమైన రద్దీ ఉంటుంది.కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఉప్పల్ నుంచి నారపల్లి నేషనల్ హైవే అథారిటీ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ పనులు మరియు సిపిఆర్ఏ నుండి అన్నోజిగూడ వరకు పనులు జరుగుతున్నాయి సంవత్సరాలుగా,
ఈ దారిలో ప్రతి నిత్యం ఏదో ఒకచోట వాహన ప్రమాదాలు జరిగి సామాన్యప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్న సంఘటనలు అనేకం.
రాష్ట్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రభుత్వం ఉప్పల్ నుంచి ఘట్కేసర్ యాదాద్రి వరకు మెట్రో రైల్ మార్గాన్ని పొడిగించి ట్రాఫిక్ రద్దీని నివారించడంతో పాటు హైదరాబాద్ ఈస్ట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు కోరుతున్నారు.