నిజాంపేట్ అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు

Spread the love

మేయర్ శ్రీమతి శ్రీ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ సునీల్ రెడ్డి,ఆవుల జగన్ యాదవ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి లతో మర్యాద పూర్వకంగా కలిసిన నిజాంపేట్ అచట్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు.

ఈ సందర్భంగా వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా వారి ఆధ్వర్యంలో నిర్వహించనున్న అన్నదాన కార్యక్రమానికి,అదే విధంగా 20వ డివిజన్ కార్పొరేటర్ బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం ఆధ్వర్యంలో బాచుపల్లి ఇంద్ర నగర్ కాలనీ వినాయక నిమజ్జనోత్సవ వేడుకకు,మరియు NMC బిఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సాంబశివ రెడ్డి మరియు సభ్యుల ఆధ్వర్యంలో 22వ డివిజన్ ఎన్ఆర్ఐ కాలనీ వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి,14వ డివిజన్ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ బొబ్బా శ్రీనివాస్ మరియు సభ్యుల ఆధ్వర్యంలో స్థానిక డివిజన్ వాసుల వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి,5వ డివిజన్ ప్రగతి నగర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమానికి వంటి కార్పొరేషన్ పరిధిలో పలు యూత్ అసోసియేషన్ సభ్యుల వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా అన్నదాన,ఉత్సవ వేడుకలకు,మరియు పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిధులుగా హాజరు కాగలరని ఆహ్వానించడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page