తెలంగాణ విజయ డెయిరీ కి చెందిన మెగా డెయిరీ ప్లాంట్

Spread the love

తెలంగాణ విజయ డెయిరీ కి చెందిన మెగా డెయిరీ ప్లాంట్ ను అక్టోబర్ 5 వ తేదీన ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. డాక్టర్ BR అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని తన చాంబర్ లో విజయ డెయిరీ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డెయిరీ చైర్మన్ సోమా భరత్ కుమార్ గుప్తా, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార్ సిన్హా, డెయిరీ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా రావిర్యాల్ లో 250 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 5 నుండి 8 లక్షల లీటర్ల సామర్ధ్యంతో మెగా డెయిరీ ని నిర్మించినట్లు వివరించారు. ప్రారంభోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన చేపట్టి పూర్తీ చేయాలని ఆదేశించారు. మెగా డెయిరీ ప్రారంభం తో విజయ ఉత్పత్తుల ఉత్పత్తి సామర్ధ్యం కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మార్కెటింగ్ వ్యవస్థ ను మరింత బలోపేతం చేయాలని, మరిన్ని విజయ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రణాళికలను సిద్దం చేయాలని పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ ఆధార సిన్హా ను మంత్రి ఆదేశించారు.

అదేవిధంగా రైతుల నుండి పాల సేకరణ, రవాణా, ఉత్పత్తుల మార్కెటింగ్ తదితర కార్యకలాపాలు సులువుగా నిర్వహించుకొనేందుకు రాష్ట్రంలో 6 జోన్ లను ఏర్పాటు చేసే అంశంపై అద్యయనం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలకు విజయ పాలను సరఫరా చేసే విధంగా ఆ శాఖ కు చెందినా అధికారులతో సంప్రదింపులు జరపాలని అన్నారు. తీవ్ర నష్టాల ఊబిలో కూరుకపోయి మూతపడే స్థితిలో ఉన్న విజయా డెయిరీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక చొరవతో ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు.

విజయ డెయిరీ నేడు 800 కోట్ల రూపాయలకు పైగా టర్నోవర్ కు చేరుకుందని, ఇది ఎంతో గర్వకారణం అన్నారు. లక్షలాది మంది జీవనోపాధి పొందుతున్న పాడి పరిశ్రమ రంగాన్ని రాష్ట్రంలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని వివరించారు. ఈ రానంగాలోని రైతులను ప్రోత్సహించే విధంగా 4 రూపాయల నగదు ప్రోత్సాహకం, సబ్సిడీ పై పాడి గేదెలను అందిస్తున్నట్లు తెలిపారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేట్ డెయిరీ లకు దీటుగా విజయ డేయిరీ ని తీర్చిదిద్దుతున్నట్లు పేర్కొన్నారు. లాలా పేట డెయిరీ లో పూర్తిస్థాయిలో CC కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ వినియోగంపై ఆర్ధిక భారాన్ని తగ్గించుకొనే దిశగా సోలార్ విద్యుత్ వినియోగంపై దృష్టి సారించాలని ఆదేశించారు. విజయ డెయిరీ బ్రాండ్ తో నకిలీ ఉత్పత్తులు మార్కెటింగ్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
,,,,,,,,,,

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page