సాక్షిత : మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన కమీషనర్ రామకృష్ణ రావు ,ఎస్. ఈ సత్యనారాయణ తో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారి వారి డివిజనన్ల లో నెలకొన్న పలు సమస్యలు, పెండిగ్ లో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు,మౌలిక సదుపాయాల గురించి చర్చా సమావేశం నిర్వహించడం జరిగింది. భాగంగా మేయర్ మాట్లాడుతూ సమస్యల పరిష్కారానికి కృషి, పెండింగ్ దశలో ఉన్న పలు నిర్మాణ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు తెలియజేశారు. అనంతరం కార్పొరేషన్ పరిధిలో పలు నిర్మాణ అభివృద్ధి పనులపై సమీక్ష,అదే విధంగా వర్షా కాలం దృష్ట్యా కార్పొరేషన్ పరిధిలో రోడ్లు,డ్రైనేజ్ లు,SNDP నాలా నిర్మాణ పనులు పూర్తి,ట్రాఫిక్ ఇబ్బందులు, రోడ్ ప్యాచ్ వర్క్స్ ,పెరిగిన చెట్లు,విద్యుత్ తీగలు,స్తంభాలు,పురాతన నిర్మాణ సముదాయాల పట్ల జాగ్రత్త,వంటి విషయాలపై ఇంజినీరింగ్,టౌన్ ప్లానింగ్ ,శానిటేషన్,ఎలక్ట్రికల్,మాన్సూన్ టీమ్,ఆయా విభాగాల అధికారులతో సుధీర్ఘంగా చర్చించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు చిట్ల దివాకర్,బాలాజీ నాయక్,ఏనుగుల శ్రీనివాస్ రెడ్డి ,కో ఆప్షన్ సభ్యుడు అభిషేక్ రెడ్డి,స్వతంత్ర కార్పొరేటర్లు వెంకట రామయ్య,శ్రీరాములు,సుజాత,NMC ఆయా విభాగాల అధికారులు,మరియు సిబ్బంది,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్వతంత్ర కార్పొరేటర్లతో సమావేశం
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…