SAKSHITHA NEWS

వైద్య ఆరోగ్యశాఖ పై సమీక్ష .. సీఎం జగన్ కీలక ఆదేశాలు..

తాడేపల్లి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.గణనీయంగా చికిత్సా విధానాలను పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. కొత్తగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి 754 ప్రొసీజర్లను అనుమతించారు. మొత్తంగా ఆరోగ్యశ్రీ కింద 3,118 చికిత్సా విధానాలు వచ్చాయి. ఇకపై కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లుగా మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్లు వ్యవహరించనున్నారు..


SAKSHITHA NEWS