జాతీయ సదస్సులో పొరపాట్లు రానివ్వద్దు – జాయింట్ కలెక్టర్ బాలాజీ

Spread the love

జాతీయ సదస్సులో పొరపాట్లు రానివ్వద్దు – జాయింట్ కలెక్టర్ బాలాజీ
సాక్షిత, తిరుపతి బ్యూరో: తిరుపతి జిల్లా ఏర్పడిన తరువాత మొదటిగా కార్మిక శాఖ జాతీయ సదస్సు జరగనున్నదని, ప్రతిష్టాత్మకంగా తీసుకుని పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని తిరుపతి జాయింట్ కలెక్టర్ డి.కె.బాలాజీ అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాతీయ సదస్సుకు విధులు కేటాయించిన లైజన్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమావేశమై పలు సూచనలు చేశారు. జేసి మాట్లాడుతూ ఈ నెల 25, 26 న దేశంలోని అన్ని రాష్ట్రాల , కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కార్మిక శాఖల మంత్రులు, కార్యదర్శులు, ఉన్నతాధికారులు దాదాపు వంద మందికి పైగా జిల్లా కు రానున్నారని లైజన్ అధికారులదే కీలక పాత్ర అని అన్నారు. రేణిగుంట, చెన్నై విమానాశ్రయాల వద్ద హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. లైజన్ అధికారులు కేటాయించిన విధుల మేరకు సంబందిత విఐపిలతో సమన్వయం చేసుకుని వారి రాక వివరాలు, బస చేసే ప్రాంతం, వాహనాల వంటి సదుపాయాల కోసం సంబందిత కమిటీల వివరాలు మీవద్ద ఉండాలని సూచించారు. కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ , ట్రాన్స్పోర్ట్ , అకాండేషన్, ప్రోటోకాల్, ఐటీ, మెడికల్, దర్శన్ , రిసెప్షన్ వంటి కమిటీల వివరాలు అందుబాటులో ఉంచుకుని ఎప్పటికప్పుడు విఐపీ లకు అసౌకర్యం కలగకుండా సౌకర్యాలను అందించాలని సూచించారు. తిరుమల దర్శనం కు వెళ్ళే విఐపీ లకు సంప్రదాయ దుస్తులలో రావాలని తెలియజేస్తూ , వారి ఆధర్ నెంబరు తప్పనిసరి కమిటీకి అందించాలని సూచించారు.
ఈ సమావేశంలో పీఎఫ్ డిపార్ట్మెంట్ కమీషనర్ వెంకటేశ్వర్ రావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, విధులు కేటాయించిన లైజన్ అధికారులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page