జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయింది:యనమల

Spread the love

జగన్ పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయింది:యనమల

అమరావతి : రాష్ట్రంలో అరిస్టోక్రాటిక్ పాలన నడుస్తోందని, జగన్మోహన్ రెడ్డి (CM Jagan) పాలనలో యువతకు ఉపాధి కలగానే మిగిలిపోయిందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) విమర్శించారు.బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలముందు యువతకు అనేక హామీలిచ్చి వారి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చాక యువత నెత్తిపై జగన్ భస్మాసుర హస్తం పెట్టారన్నారు. 2.30 లక్షల ఉద్యోగాల ఖాళీల భర్తీ, జాబ్‌ క్యాలెండర్‌పై.. జగన్‌ను నిరుద్యోగులు నిలదీయాలన్నారు. మూడేళ్లలో ఏపీలో పెట్టుబడులు రాకపోగాఉన్నవీపోయాయని, జగన్‌కు సీఎం హోదా వచ్చాక ప్రత్యేక హోదాను మరిచారని విమర్శించారు.రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు లేక నవ్యాధ్రంలో నిరుద్యోగాభివృద్ది దిన, దినాభివృద్ది చెందుతోందని యనమల అన్నారు. 75 శాతం పరిశ్రమల్లో స్ధానికులకే ఉద్యోగాలన్న జగన్ రెడ్డి.. కొత్త పరిశ్రమలు, తీసుకురాగపోగా ‎ కమీషన్ల కోసం ఉన్న వాటిని తరిమేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం ప్రతి నెలా 6 లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి నిరుద్యోగులకు ద్రోహం చేశారన్నారు. వైసీపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కార్పొరేషన్లు ద్వారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పిస్తే.. జగన్ రెడ్డి రద్దు చేసి వారి పొట్టకొట్టారని యనమల రామకృష్ణుడు ఆరోపించారు.

Related Posts

You cannot copy content of this page