**తిరుపతి నగరం* : సమస్యల పరిష్కారానికే స్పందన నిర్వహిస్తున్నామని, స్పందనను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. ప్రజా పిర్యాధుల పట్ల అలసత్వం చూపకుండా సకాలంలో పరిష్కరించేలా అధికారులు తగు చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో డయల్ యువర్ కమిషనర్, అర్జీలు స్వీకరించే స్పందన కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష పాల్గొనగా, కమిషనర్ హరిత ఐఏఎస్ అర్జీలను స్వీకరించారు. ఎన్జివో కాలనీ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా టీ షాపు ఏర్పాటు చేసారనే పిర్యాదుపై కమిషనర్ స్పందిస్తూ వెంటనే ఆ షాపును పరిశీలించి అనుమతులు వున్నాయా లేవా అని పరిశీలించాలని,
స్థలం అక్రమణకు గురై వుంటె తొలగించాలని అధికారులకు తగు సూచనలు జారీ చేసారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్ కు 17, స్పందనకు 22 పిర్యాధులు అందగా, వాటిలో ముఖ్యంగా కొత్తపల్లి ప్రాంతంలో కాలువలు, రోడ్లు, తెలుగుగంగ లైన్ ఏర్పాటు చేయాలని, తిలక్ రోడ్డులో స్పీడ్ బ్రెకర్ ఎత్తు పెంచాలని, గాంధీపురం, న్యూ ఇందిరానగర్ ప్రాంతాల్లో తెలుగుగంగ నీరులో డ్రైనేజ్ కలుస్తున్నదని, సుభాష్ నగర్, మారుతీ నగర్లో చెట్టు కొమ్మలు తొలగించాలని, వరదరాజనగర్ పెట్రోల్ బంక్ ప్రక్కనున్న 60 అడుగుల రోడ్డులో 40 అడుగుల రోడ్డు వేయడంతో రోడ్డు ప్రక్కన బంకులు, వాహనాలు పార్కింగ్ వలన ఇబ్బందిగా వుందని, సున్నపువీధి వద్ద మ్యాన్ హోల్ పై కవర్ ఏర్పాటు చేయించాలని,
కొన్ని ఏరియాల్లో డ్రైనేజి సమస్యలపై వచ్చిన పిర్యాధులపై కమిషనర్ స్పందిస్తూ పిర్యాధుల పరిష్కారానికి సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోని సకాలంలో పరిష్కరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, సెక్రటరీ రాధిక, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ అన్వేష్ రెడ్డి, సిటీ ప్లానింగ్ అధికారులు శ్రీనివాసులు రెడ్డి, బాలసుబ్రమణ్యం, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంధ్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, సర్వేయర్ దేవానంద్, సూపర్డెంట్లు, డిఈలు, ఆర్.ఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.*