రైతు రాజ్యం తెస్తానన్నాడు. రైతు లేని రాజ్యం చేశాడు జగన్

Spread the love

వేగేశన నరేంద్ర వర్మ
బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని ఈ అరాచక వైసిపి ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశానుసారం బాపట్ల తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ శ్రీ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సంఘీభావ రిలే నిరాహార దీక్ష నందు తెలుగు రైతు విభాగం నాయకులు దీక్షకు కూర్చుని తమ సంఘీభావం తెలియజేయగా నరేంద్ర వర్మ ఆ దీక్షలో పాల్గొని వారికి మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర వర్మ కామెంట్స్..

వైఎస్‌ఆర్‌ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులకు వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా రైతులకు సకాలంలో విత్తనాలు, పురుగు మందులు, ఫర్టిలైజర్స్‌, ఇన్పుట్‌ సబ్సీడీ, రైతు ఇన్సూరెన్స్‌, రైతు భరోసా, సబ్సీడీ డ్రిప్‌ సామాగ్రి, యంత్రాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంత వరకు రైతులకు అందజేయలేదు.

రైతులకు వేల కోట్ల రూపాయల సాయం అందించామనే జగన్‌ రెడ్డి ప్రకటనలు అబద్ధం. ప్రజలనుతప్పుదారి పట్టించేందుకే దొంగ లెక్కలు చెబుతున్నారు.

పంటలకు గిట్టుబాటు ధర, సున్నా వడ్డీ రుణాలు, పంట బీమా, ఇన్‌ పుట్‌ సబ్సీడీ అమలులో వైఫల్యంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రూ.22 వేల కోట్లు నష్టపోయారు.

జగన్మోహన్ రెడ్డి పైశాచిక ఆనందం కోసం సిఐడి చంద్రబాబు పేరు ఇరికించి జైలుకు పంపారన్నారు.

తొందర్లోనే చంద్రబాబు కడిగిన ముత్యంలా, మచ్చలేని నాయకుడిగా జైలు నుండి బయటకు వస్తారన్నారు

వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు విసిగిపోయారని రాబోయే రోజుల్లో ప్రజలందరూ తగిన గుణపాఠం ఈ అరాచక పాలనకి సమాధానం ఇస్తారన్నారు.

సాయంత్రం వేగేశన నరేంద్ర వర్మ నాయకులకు, కార్యకర్తలకు,నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమించారు.

ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ తెలుగు రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page