mass Srimantala program was organized under the auspices of ICDS
కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని చల్లూరు గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు
వీణవంక మండలం చల్లూరు గ్రామంలో గర్భిణీలు పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకున్నట్లయితే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా జన్మిస్తాడని ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతిరెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతి రమేష్ తెలిపారు తెలిపారు. సోమవారం వీణవంక మండలం చల్లూరు గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషన్ మహాన్ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు కార్యక్రమం నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుండి 30 వరకు పోషన్ మహాన్ వారోత్సవాలలో భాగంగా గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు ,చిన్నారులకు అక్షరాభ్యాసం లాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. గర్భిణీ స్త్రీలకు తమ అంగన్వాడి కేంద్రాలలో తల్లిదండ్రులకు దూరంగా ఉన్నామనే భావన లేకుండా తమ సొంత ఇంట్లోనే శ్రీమంతం జరిపించినట్లుగా అనుభూతి పొందేలా కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సవిత మల్లయ్య, ఐసిడిఎస్ సూపర్వైజర్ శశికిరణ్మయి, డాక్టర్ శ్రావణ్, ఎంపీ ఓ ప్రభాకర్, వార్డ్ మెంబర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ,ఏఎన్ఎం, ఆశా వర్కర్లు, సిబ్బంది పాల్గొన్నారు.