SAKSHITHA NEWS

జగత్గిరిగుట్ట పరిధిలోని మైసమ్మ నగర్ బి -బ్లాక్ నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 డివిజన్ జగత్గిరిగుట్ట పరిధిలోని మైసమ్మ నగర్ బి -బ్లాక్ కమిటీ సభ్యులుగా అధ్యక్షులు . బస్వప్ప , జనరల్ సెక్రటరీ రవీందర్ రెడ్డి, కోశాధి కారి శ్రీకాంత్ యాదవ్, వెంకటేష్, సంతోష్, రాములు, సాయి ,ప్రేమ్ నూతనంగా ఎన్నికైన సందర్బంగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోలన్ హన్మంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకి శాల్వాతో సత్కరించారు. ఈ సందర్బంగా హన్మంతన్న మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి ఎల్లప్పుడు అండగా ఉంటానని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డివిజన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వేణు గౌడ్, బుచ్చి రెడ్డి పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app