సకలజనుల కార్తీక వనసమారాధన కార్యక్రమం లో పాల్గొని పలు

Spread the love

Many participated in the Kartika Vanasamaradhana program of the people

సాక్షిత : వినుకొండ నియోజకవర్గంలోని కొన్ని రోజుల క్రితం జరిగిన సకలజనుల కార్తీక వనసమారాధన కార్యక్రమం లో పాల్గొని పలు సేవలందించిన వినుకొండ పట్టణంలోని పలు సేవా సంఘాల వారినీ, మరియు స్వచ్ఛంద సంస్థల వారిని, కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి సహకరించిన పుర ప్రముఖులను పిలిచి వారి సేవలకు గాను *వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు * ప్రతి ఒక్కరికీ శాలువా కప్పి, హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సకలజనుల కార్తీక వనసమారాధన కార్యక్రమం దిగ్విజయంగా జరగడానికి మీరందరూ సహాకరించినందుకు పేరు పేరున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీ అందరీ సహాయ సహకారాలతోనే ఆ మహా కార్యక్రమాన్ని ఏలాంటి ఆటంకాలు లేకుండా చేయగలిగామని అందుకు సహాకరించినందుకు నా తరపున ఇలా చిరు సత్కారం చేయాలనిపించి మిమ్మల్ని ఇలా పిలిచామని అన్నారు.

పుర ప్రముఖులు మాట్లాడుతూ….
సకలజనుల కార్తీక వనసమారాధన కార్యక్రమే కాదు, ఎమ్మెల్యే ఎటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకున్నా మా పూర్తి సహాయ సహకారాలు అందించాలని తెలిపారు…

Related Posts

You cannot copy content of this page