ప్రజా నాయకుడు, అభివృద్ధి ప్రధాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గెలుపుతో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని టిఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల్లో గత రెండు రోజులుగా పండగ వాతావరణం నెలకొంది. పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శాలువాలు కప్పి బొకేలు అందజేస్తూ, మిఠాయిలు తినిపించుకుంటూ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని ఏ నాయకుడికి ఇవ్వని అపూర్వ మెజార్టీని అందించి నన్ను ఆశీర్వదించారని, రానున్న ఐదేళ్ల కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేసుకుంటూ నియోజకవర్గాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. నాకు ఇంతటి భారీ మెజార్టీని అందించిన కుత్బుల్లాపూర్ ప్రజల రుణం జన్మలో తీర్చుకోలేనిదన్నారు.
ఈ విజయోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు