మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని నవులూరులో పలు అభివృద్ధి

Spread the love


Many developments in Navulur under Mangalagiri Municipal Corporation

మంగళగిరి నగరపాలక సంస్థ పరిధిలోని నవులూరులో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే ఆర్కే….

నవులూరు మక్కేవారి పేటలో సుమారు రూ 22 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైను, పనులను మరియు గ్రావెల్ రోడ్లను పరిశీలించారు.

అలాగే రూ. 40 లక్షల నిధులతో చేపట్టిన క్రిస్టియన్ స్మశాన వాటిక అభివృద్ధిలో భాగంగా ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు.

గ్రామంలో నెలకొన్న విద్యుత్తు, డ్రైనేజీ వంటి సమస్యలను స్థానికుల ద్వారా తెలుసుకొని విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి స్థానిక సమస్యలను గుర్తించి సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రతిపాదనలను సిద్ధం చేసి సకాలంలో పనులు ప్రారంభించాలని సూచించారు.

ఇచ్చిన మాట ప్రకారం గ్రామంలో అంతర్గత రోడ్లు ఏర్పాటుచేసిన ఎమ్మెల్యే ఆర్కే కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

ఎంతో కాలంగా ఇబ్బందులు పడ్డామని, ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే అభివృద్ధి చేశారని తామెప్పుడూ ఆర్కే కి అండగా ఉంటామని స్థానికులు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page