సికింద్రాబాద్ లోని ఐదు మున్సిపల్ డివిజన్లలో మెజారిటీ తధ్యం * పెరుగుతున్న ప్రజాదరణకు బీఆర్ ఎస్ కార్యకర్తల కృషి కారణం
డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్
సాక్షిత సికింద్రాబాద్ : తెలంగాణా రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ప్రభుత్వం హట్రిక్ సాధిస్తుందని, తాము కూడా హ్యాట్రిక్ సాధించడం తధ్యమని డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ బీ ఆర్ ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లో స్థానిక కార్పొరేటర్ సామల హేమతో కలిసి ఎన్నికల ప్రచార పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ ఎన్నికల ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమించామని, కొన్ని పార్టీ లు కేవలం ఎన్నికల సందర్భాల్లో మాత్రమే ప్రజా వద్దకు వస్తున్నాయని అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గం లోని అయిదు డివిజన్ల మధ్య మెజారిటి సాధించేందుకు పోటీలు నెలకొనడం తమ పార్టీ కార్యకర్తల ఆత్మ విశ్వాసానికి దర్పణమని అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో పురోగమించిందని తెలిపారు. కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత, నేతలు కరాటే రాజు, కిరణ్ కుమార్ గౌడ్, రామేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. medi బావి, ఇందిరానగర్ కాలనీ, బీదల బస్తీ, శ్రీనివాస్ నగర్, సీతారాం నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన పద్మారావు గౌడ్ కు ఈ సందర్భంగా అడుగడుగునా లభించిందింది.