
జగ్గయ్యపేట నియోజకవర్గం, వేమవరం గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు మాదల వీరయ్య చౌదరి ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం సామినేని ఉదయభాను అభినందనలు తెలిపారు. తనకు ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి, ప్రభుత్వవిప్ సామినేని ఉదయభాను కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
