
ఆర్టీసీ బస్సు ఫుల్ ఆటోవాలా బ్రతుకు బేజారు
దీనికి ఫ్రీ బస్ కారణమా మనం ఓటేసిన పాపమా
సాక్షిత దినపత్రిక టేక్మాల్ ప్రతినిధి పవన్
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్. మండల పరిధిలోని బోడ్మాట్ పల్లి చౌరస్తాలో బస్సు వచ్చిందంటే చాలు 100 మంది ఎక్కాల్సిన బస్సులో 200కు పైగా ప్యాసింజ ర్ వెళ్తున్నారు
ప్రభుత్వం అమలు చేసిన మహిళా ఉచిత బస్ సౌకర్యం మహిళలకు సంతోషంగానే ఉంది కానీ ఆటో వాళ్ళ బ్రతుకు బజారుకెక్కింది ఆటో ఫైనాన్స్ కట్ట లేక ఫైనాన్స్ ద్వారా తీసుకున్న ఆటోలు ఫైనాన్స్ కు తీసుకెళ్తున్నారు వాళ్ళ బ్రతుకు అయోమయంగా మారింది ఎక్కడ కష్టం చేయలేక తిండి లేక పిల్లల చదువులు చదివించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ,
ఫ్రీ బస్ కావడం వల్ల మహిళలు అందరూ బస్సులోనే ప్రయాణిస్తున్నారు, 90 మంది మహిళలు ఉంటే పదిమంది మగవాళ్ళు ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ప్యాసింజర్ ను ఎక్కడికి వెళ్తారు అని అడిగితే మా దగ్గర ఆధార్ కార్డు ఉంది మాకు ఫ్రీ బస్సు ఉంది అని సమాధానం చెబుతున్నారు, అని ఆటో డ్రైవర్స్ తెలిపారు ఆటో డ్రైవర్స్ ఏమి చేసేది లేక నోరు మూసుకొని కూర్చోవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో వాళ్ళని ఆదుకోవాలని ఆటో డ్రైవర్స్ ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు లేనిపక్షంలో ధర్నాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app