SAKSHITHA NEWS

3000 వేల మంది భక్తులతో 3 లక్షల హనుమాన్ చాలీసా పారాయణం కు ఏర్పాట్లు

ఖమ్మం : శ్రీ స్తంబాద్రి ఆధ్యాత్మిక సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చొప్పున మూడు లక్షల పారాయణం జరుగుతున్న కార్యక్రమం ఏర్పాట్లు స్థానిక పెవిలియన్ గ్రౌండ్స్లో ముమ్మరంగా జరిగాయి . సుమారుగా 3,000 మంది పైచిలుకు భక్తులు పాల్గొంటారని తెలిపారు . ఆదివారం ఉదయం 7:30 నిమిషాలకు ప్రారంభమవుతుందని తెలిపారు . ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అలాగే మిగతా ప్రాంతాలు కూడా ఇలాంటి కార్యక్రమం ఇంతవరకు కనివిని ఎరగని రీతిలో జరుగుతున్నారు . ఈ కార్యక్రమంలో వేములపల్లి వెంకటేశ్వరరావు , గన్నవరపు నాగేశ్వరరావు , లగడపాటి రామారావు , ప్రతాపని నరసింహారావు , కురువెల్ల జగన్మోహన్ రావు , సూరా విష్ణు , కొత్త వెంకట నారాయణ , గన్నవరపు ఆదినారాయణ , వెదులపల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు .

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app