Live హుజురాబాద్ మరియు జమ్మికుంట జమాతే ఉలేమా సభ విజయవంతం మౌలానా మీర్జా ఇమ్రాన్ బేగ్ ఆధ్వర్యంలో

Spread the love

Live Huzurabad and Jammikunta Jamaate Ulema Sabha was successful under Maulana Mirza Imran Baig.

హుజురాబాద్ మరియు జమ్మికుంట జమాతే ఉలేమా సభ విజయవంతం మౌలానా మీర్జా ఇమ్రాన్ బేగ్ ఆధ్వర్యంలో

నేడు హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్ లో జరిగిన హుజురాబాద్ మరియు జమ్మికుంట జమాతే ఉలేమా ఆధ్వర్యంలో జరిగిన సభలో ముఖ్య అతిథులుగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మౌలానా ఇర్ఫాన్ కాస్మి హాజరయ్యారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లాహ్ ఆర్థికంగా ఏదైనా ఇచ్చినప్పుడు అందులో కొంత భాగం నిరుపేదలకు సహాయం చేయాలి.ఎవరైనా ఆపదలో ఉన్నట్లయితే అలాంటి వారిని ఆదుకోవలసిన బాధ్యత అందరిపై ఉంటుందని తెలిపారు.ఇటీవల జమాతే ఉలేమా ఆధ్వర్యంలో మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై పరీక్ష పోటీలు నిర్వహించడం జరిగినది,దీనిలో మతాలకు అతీతంగా బాలురు బాలికలు ప్రతి ఒక్కరూ పరీక్ష పోటీలలో పాల్గొన్నారు.

గంగా జమున తహీజిబ్ ను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి ప్రశాంత వాతావరణంలో ఉండాలని కూడా ఈ సందర్భంగా మౌలానా ఇర్ఫాన్ కాస్మి విజ్ఞప్తి చేశారు,ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రవేట్ & మైనార్టీ మరియు ఉర్దూ మీడియం పాఠశాలల నుంచి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని,విద్యార్థులు పాలోగొన్నరు,మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర పోటీ పరీక్షల్లో మొదటి మూడు స్థానాలు విజేతగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హుజరాబాద్ డివిజన్ మజీద్ ఈద్గా & కబ్రస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ఎంఐఎం పార్టీ అధ్యక్షులు గూలం అహ్మద్,బి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు సాజిద్ ఖాన్,హుజురాబాద్ & జమ్మికుంట జమాతే ఉల్మా అధ్యక్షులు మిర్జా ఇమ్రాన్ బేగ్, జమాతే ఉలేమా కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ముఫ్తీ యునుస్ కాస్మి గారు,జమాతే ఉలేమా కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు గయాస్ గారు, ముఫ్తీ షాకీర్ గారు,మౌలానా నయీమ్, నజీర్,సూఫియాన్, జమ్మికుంట మౌజన్ సలీం,అజర్ జమ్మికుంట మౌలానా,నయ్యర్, మరియు ఫసి భాయ్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page