SAKSHITHA NEWS

Lion Kalmicherla Ramesh, president of Lions Club Kalvakurti, aka Annadanam Mahadanam

అన్నదానం మహాదానము
అన్నదానం మహదానం అని లయన్స్ క్లబ్ కల్వకుర్తి అధ్యక్షుడు లయన్ కల్మిచెర్ల రమేష్,ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు శివరాం లు అన్నారు


సాక్షిత : ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన బాలింతలు, గర్భిణీ స్త్రీల కు,రోగులకు లయన్స్ క్లబ్ కల్వకుర్తి ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు ఈసందర్భంగా అన్నదానం కార్యమాన్ని ప్రారంభించిన అనంతరం అధ్యక్షుడు రమేష్ మాట్లాడుతూ లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం 210 దేశాలలో నిర్వహిస్తున్నా మని చెప్పారు కల్వకుర్తి క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే 10 కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు

రాబోయే రోజుల్లో మరో 30 అన్నదానం కార్యక్రమాలకు రూపకల్పన చేశామని అన్నారు 320 మందికి అన్నదానం చేశారు దాత జూలూరి ప్రకాష్ ఈకార్యక్రమంలో క్లబ్ ప్రదాకార్యదర్శి లయన్ చిగుళ్లపల్లి శ్రీధర్. జాయింట్ సెక్రటరీ మిరియాల శ్రీనివాస్ రెడ్డి, మెంబర్షిప్ కమిటీ చైర్మన్ గుబ్బకిషన్, గొవింద్ శ్రీనివాస్,జులూరి ప్రకాష్, మాచిపెద్ది అశోక్, పూరి రమేష్,బాదం రాఘవేందర్,రవి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS