SAKSHITHA NEWS


Let’s work to solve the problems in the villages:

గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేద్దాం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్”


సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను” కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ మండల పరిధిలోని పులుసుమామిడి గ్రామంలో ఉదయం 06:45 AM నుండి 11:30 AM వరకు పర్యటించారు.

గ్రామంలో థర్డ్ వైర్ ఏర్పాటు చేసి, అవసరమైన చోట నూతన స్తంభాలు ఏర్పాటు చేయాలని, వాటికి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు, వంగివున్న స్థంబాలను సరి చేయాలని, గ్రామంలో మరియు పంట పొలాలలో వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేసి, మంజూరు అయిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

పల్లె ప్రగతిలో చేయలేనటువంటి పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు.

గ్రామంలో 6వ వార్డు మరియు 8వ వార్డులో నీటి సమస్య ఎక్కువగా ఉందని ఎమ్మెల్యే కి ప్రజలు తెలుపగా గేట్ వాల్వ్ ఏర్పాటు చేసి సరిపడా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మిషన్ భగీరథ పైపులు లీకేజీలు లేకుండా ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేపట్టాలని, నూతనంగా ఏర్పాటైన కాలనీలో ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ప్రజలు చెర్రలు తీయరాదని, ప్రజలు నల్లాలకు ట్యాప్ లు వాడాలని సూచించారు.

గ్రామంలో పాడుబడ్డ ఇళ్లను మరియు పిచ్చిమొక్కలను తొలగించాలని, పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు.

గ్రామంలో పశువుల చికిత్స స్టాండ్ ఏర్పాటు చేసి, ప్రతి బుధవారం 9 గంటలకు గ్రామపంచాయతీ ఆవరణలో అందుబాటులో ఉండాలని, పశు వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

అనంతరం గ్రామంలో నూతనంగా వేసినటువంటి సీసీ రోడ్లను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS