SAKSHITHA NEWS

ప్రజా సంక్షేమ పాలకుడు జగనన్న ముఖ్యమంత్రిని చేసుకుందాం..రాబోయే ఎన్నికల్లో మరొక్కసారి ఫ్యాన్‌ గుర్తుపై బటన్ నొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను.. ఎమ్మెల్యే అభ్యర్థి డెప్యూటీ మేయర్ భూమన అభినయ్ రెడ్డి .


సాక్షిత : 13వ వార్డ్ స్థానిక మహిళలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొనడం జరిగింది.

గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా జగనన్న సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. అలాగే పేద ప్రజల పిల్లల్లో లెర్నింగ్ స్కిల్స్ పెరిగేలా, కార్పొరేట్ విద్యార్థులతో పోటీ పడేలా ఐబీ లాంటి ఇంటర్నేషనల్ సిలబస్ అమల్లోకి తీసుకొచ్చారు. ఇలా చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల పిల్లలు పెద్ద చదువులు చదువుకుని జీవితంలో ఉన్నతంగా స్థిరపడతారు. పిల్లలకు ఆస్తులు ఇవ్వనక్కర్లేదు.. మంచి చదువు చెప్పిస్తే అదే వారికి పెద్ద ఆస్తిగా జగనన్న భావించి ఇలాంటి పథకాలు తీసుకొచ్చారు.

ఇక అవ్వతాతలకు ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్లు చేత ఠంచన్‌గా పింఛన్ అందేలా చేస్తున్నారు. గత ప్రభుత్వాల్లో పింఛన్ కోసం గంటలు, రోజుల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా మన ఇంటి ముందుకే అన్ని సౌకర్యాలు తీసుకొచ్చారు. ప్రస్తుతం మీకు అందిస్తున్న వైఎస్సార్ ఆసరా సున్నా వడ్డీ, వైఎస్సార్ చేయూత, అమ్మఒడి లాంటి పథకాలు అందాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది. పేద ప్రజల కోసం ఇన్ని బటన్‌లు నొక్కి మీ జీవితాల్లో వెలుగులు నింపుతున్న జగనన్న కోసం రాబోయే ఎన్నికల్లో మీరు ఒక్కసారి ఫ్యాన్‌ గుర్తుపై బటన్ నొక్కాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

WhatsApp Image 2024 02 20 at 12.41.07 PM

SAKSHITHA NEWS