ప్రతిపక్షాల పొత్తులను చిత్తు..చిత్తు.. చేద్దాం.. నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను ఎగురవేద్దాం ..వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డి
2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టేందుకు ధైర్యం, దమ్ము లేక అందరూ ఏకమై వస్తున్నారని… కుట్రలు కుతంత్రాలు మోసాలు చేసే ప్రతిపక్ష పార్టీల పొత్తులను, ఎత్తులను చిత్తుచిత్తు చేద్దామని, మరోసారి రాష్ట్రంలోను, నంద్యాలలో వైఎస్ఆర్సిపి జెండాను రెప రెపలాడిద్దామని వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని 39 వ వార్డులో వైఎస్ఆర్సిపి కౌన్సిలర్ వెంకటలక్ష్మి , మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ(పండు) ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. వార్డులో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రజలు హారతులతో, పూలమాలలతో అడుగడుగున ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో జగనన్న సీఎం గా ఉన్న కాలంలో రాష్ట్ర ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి , అలాగే నంద్యాల నియోజకవర్గంలో శిల్పా రవి రెడ్డి చేపట్టిన అభివృద్ధి, రాబోవు కాలంలో నంద్యాలకు చేపట్టనున్న అభివృద్ధి గురించి వివరిస్తూ ప్రచార కరపత్రాలను ప్రజలకు అందజేశారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో మరోసారి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని ఆశీర్వదించాలని, అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేని ప్రతిపక్ష టిడిపి నేత చంద్రబాబు నాయుడు జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఒకే ఒక్కడు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, నమ్మకం, విశ్వసనీయత ఉన్న నాయకుడు జగనన్నను ఢీకొట్టేందుకు వస్తున్నారని వీరి పొత్తులను ఎత్తులను సమర్థవంతంగా షిత్తు చేసేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రచారంలో ఊదరగొడుతూ అమలుకు వీలులేని, సాధ్యం కానీ చేయలేని వాటి గురించి ప్రజలకు చెబుతూ మోసాలు చేసేందుకు వస్తున్నారని అటువంటి వారి మోసాలను ప్రజలు ఎన్నికలలో తమ ఓట్లతో తో తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. కేవలం వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ప్రజలు జగనన్న పై నమ్మకాన్ని ఉంచి అధికారాన్ని ఇచ్చారని, ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయక నిబద్ధతతో విశ్వసతనీయకు మరో పేరుగా జగనన్న నిలిచారని అన్నారు. జగనన్న నాడు ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను ఖురాన్ గా, భగవద్గీతగా, బైబిల్ గా భావించి అందులో ఉన్న హామీలను తూచా తప్పకుండా నెరవేర్చి మాటతప్పని మడమతిప్పని రాజన్న బిడ్డగా నిరూపించుకున్నారని తెలిపారు. అయితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గతంలో ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మేనిఫెస్టోలో తెలిపిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని చెప్పారు. ఆకర్షణ ఏమైనా మేనిఫెస్టోను తయారుచేసి కేవలం ఓట్లను దండుకోవడానికి ప్రజలను ఆకర్షించడానికి మాత్రమే పరిమితం చేస్తారని, వాటిని అమలు చేసిన పాపాన పోలేదన్నారు. వీటన్నిటిని గ్రహించిన 2019 ఎన్నికల్లో విజ్ఞులైన ప్రజలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. రాష్ట్రంలో జగనన్న 5 సంవత్సరాల కాలంలో అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు మార్పులు, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని విధంగా జగనన్న చేశారని తెలిపారు.
మరోసారి వైయస్సార్ పార్టీకి అవకాశం కల్పిస్తే దేశంలో రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా చేస్తారని అన్నారు. అలాగే నంద్యాలలో ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయక కేవలం మూడు సంవత్సరాల కాలంలో నంద్యాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని, వీటన్నింటిని చూసి సహించలేని ప్రతిపక్ష టీడీపీ నాయకులు, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ తనపై దుష్ప్రచారాలు చేస్తూ అభివృద్ధి ఎక్కడ జరగలేదని తన కళ్ళకు గంతలు కట్టుకొని మాట్లాడుతున్నారని అన్నారు. మాయమాటలు, అపబద్ధాలు చెబుతున్నాడని వాటిని ప్రజలు నమ్మే పరిస్థితులలో లేరన్నారు. నంద్యాలలో కళ్లకు కట్టినట్లుగా అభివృద్ధి కార్యక్రమాలకు సాక్షాలుగా మెడికల్ కళాశాల, ఐటిఐ కళాశాల, ఏపీ మోడల్ స్కూల్, మహిళా జూనియర్ కళాశాల, అర్బన్ హెల్త్ సెంటర్లు పార్కులు, నాడు నేడు పాఠశాలల నిర్మాణాలు, అమృత్ స్కీం, నంద్యాల జిల్లా ఆసుపత్రి ఆధునీకరణ ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిచాయని వాటిని ఎవరు చెరపలేరన్నారు. మరోసారి తనకు అవకాశం కల్పిస్తే నంద్యాలను నంబర్ వన్ జిల్లాగా నిలబెడతానని అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. గత 21 సంవత్సరాలలో టిడిపి ప్రతిపక్ష ఎమ్మెల్యే అభ్యర్థి ఫరూక్ నంద్యాలకు ఎటువంటి అభివృద్ధి చేయలేదని, చేసిన అభివృద్ధిని చెప్పాలని సూటిగా అడుగుతున్నా వాటికి జవాబు ఇచ్చే పరిస్థితులలో ఆయన లేరన్నారు. చివరి అవకాశం తనకు కల్పించాలని ఫరూక్ ప్రజలను కోరుతున్నారని అయితే ప్రజలు ఆయన మాటలను నమ్మి అవకాశం కల్పిస్తే అధికారం వచ్చాక ప్రజలను విస్మరించడం జరుగుతుందని తెలిపారు. ప్రజల కోసం, ప్రజల సమస్యలను, ప్రజల కష్టాలను ప్రజల యొక్క మంచి, చెడులను చూస్తూ పరిష్కరిస్తూ, అండగా నిలుస్తూ నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేపడుతూ నంద్యాలను ప్రగతి పథం వైపు తీసుకు వెళుతున్నానని అన్నారు. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి కార్యక్రమాలను, ప్రజా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవారికి ఇంటికి వద్దకే అందిస్తున్న వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మే నెల 13వ తేదీ జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి పోచా బ్రహ్మానందరెడ్డిని అత్యధిక మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ పీపీ నాగిరెడ్డి, డాక్టర్ రవి కృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పామ్ షావలి,ఎస్ఎండి రఫీ, నంద్యాల మూడవ అధ్యక్షుడు జాకీర్ హుస్సేన్ జెసిఎస్ కన్వీనర్ డాల్మిల్ అమీర్ వార్డు వైసిపి నాయకులు జి కుమార్ హరినాథ్ బాబు ఆసిఫ్ దాదా కలందర్, పైరోజ్, సౌదీ భాష, నూర్ ,ఎగ్బాల్ ,యూసుఫ్, వెంకట్ నారాయణ, సుబ్రమణ్యం ,చాంద్ బాషా, హుస్సేన్ షా, కాజు, కలిల్, మోయిన్, మరియు వైసీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు