కర్నూల్ నగరం పై- నిఘా కవచం

Spread the love


Kurnool City Pi- Surveillance Shield

కర్నూల్ నగరం పై- నిఘా కవచం

కర్నూలు జిల్లా సాక్షిత న్యూస్

కర్నూలు సేఫ్ సిటి కి 22 రాత్రి గస్తీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన. జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐపియస్
నేర నివారణే ప్రథమ లక్ష్యం.


http://kurnoolpolice.in/safecity …. పోలీసు సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి. 24 గంటలు పటిష్ట నిఘా.2023 నూతన సంవత్సరంలో కర్నూలు నగరాన్ని పూర్తి సేఫ్ సిటీగా మార్చేందుకు గట్టి చర్యలు చేపట్టామని కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఐపియస్ అన్నారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర శనివారం రాత్రి గస్తీ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సంధర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడారు.

నగరంలో రాత్రి సమయంలో పెట్రోలింగ్ ను మరింత కట్టుదిట్టంగా నిర్వహించేందుకు ప్రత్యేకంగా పోలీసుబృందాలను ఏర్పాటు చేశామన్నారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ క్రమబద్దీ కరణకు ట్రాఫిక్ పోలీసుసిబ్బందిని పెంచామన్నారు.నగరంలో అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రాంతాలను గుర్తించామన్నారు. ఆ ప్రాంతాల్లో ఇకపై ప్రతిరోజు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ వహించి పెట్రోలింగ్ నిర్వహిస్తారన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు తర్వాత అతి పెద్ద సిటి గా కర్నూలు ఉందన్నారు.ముఖ్యమంత్రి ఆశయాలతో, డిజిపి ఆదేశాల మేరకు కర్నూలు పట్టణాన్ని ఉన్నత స్ధాయి పోలీసు సంరక్షణలో ప్రవేశపెట్టేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రాత్రి గస్తీ బీట్ పాయింట్స్ 102 నుండి 335 కు పెంచామన్నారు. 7 సెక్టార్ లలో 22 చిన్న చిన్న సబ్-రూట్స్ గా విభజించడం జరిగిందన్నారు.

డిఎస్పీ స్ధాయి అధికారులు రాత్రి గస్తీ ని పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. కంట్రోల్ రూమ్ నుండి పోలీసు అధికారులు మానిటరింగ్ చేస్తున్నారన్నారు. ఒపెన్ డ్రింకింగ్,డ్రంకెన్ & డ్రైవ్ లో దాదాపు 2500 మందిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నామన్నారు. రాత్రి 7 నుండి ఉదయం 5 వరకు ప్రత్యేక గస్తీ నిర్వహించబడుతుందన్నారు. రాత్రి గస్తీ నిర్వహించే ప్రతి పోలీసు సిబ్బందికి ప్రత్యేకమైన డ్రస్ కోడు, స్పెషల్ వెపన్స్, టార్చిలైట్, రేడియం బ్యాటన్, కమ్యూనికేషన్ సెట్ , పెప్పర్ స్ప్రే బాటిల్ లను ఇచ్చి వారిని బైక్ లో గస్తీ తిరిగి నేరాలను అరికటే విధంగా పకడ్బందీ వ్యూహంను రచించామన్నారు.


ప్రజలకు ఎక్కడైనా సమస్యలుంటే కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి ( http://kurnoolpolice.in/safecity ) సేఫ్ సిటి లింక్ క్లిక్ చేసి పోలీసు పెట్రోలింగ్ చేయాలని కోరితే కర్నూలు సేఫ్ సిటి పోలీసులు రాత్రి గస్తీ నిర్వహిస్తారన్నారు. ప్రజల్లో భద్రత భావాన్ని పెంపోందిస్తూ, అసాంఘిక కార్యకలపాలకు అడ్డుకట్ట పై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్, కర్నూలు డిఎస్పీ మహేష్, మరియు సిఐలు తబ్రేజ్, శంకరయ్య, శ్రీనివాసులు, శ్రీనివాస రెడ్డి, తిమ్మారెడ్డి, ఎస్సైలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page