నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ.

Spread the love

*నారా లోకేష్ తో కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి భేటీ.

*40 నిమిషాలు నారా లోకేష్ తో సుదీర్ఘ మంతనాలు.

*అన్ని విధాలుగా అండగా ఉంటామని నారా లోకేష్ హామీ.

*. టిడిపిని నెల్లూరు జిల్లాలో మరింత బలోపేతం చేయాలని సూచన.

*తెలుగుదేశం పార్టీలో నూతనంగా చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అనంతపురం జిల్లాలోని పుట్టపర్తిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సుమారు 45 నిమిషాల పాటు ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. నారా లోకేష్ పాదయాత్రలో గిరిధర్ రెడ్డి కాసేపు కలిసి నడిచారు.

*ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశంలో మరింత బలోపేతం చేయాలని నారా లోకేష్ గిరిధర్ రెడ్డికి సూచించారు. నెల్లూరు రూరల్ కు సంబంధించిన రాజకీయాలపై నారా లోకేష్ ఆరా తీశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రజల్లో నిరంతరం మమేకమై బలమైన నాయకులుగా ఉన్నారని ఈసారి తెలుగుదేశం పార్టీ జెండాను ఈ ప్రాంతంలో రెపరెపలాడించాలని నారా లోకేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా నేత వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, ఒట్టూరు సురేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page