కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి ని సికింద్రాబాద్ పార్లమెంట్ BRS అభ్యర్థి పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. ఆయన మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల ఎన్నికల ఇంచార్జి లు వెంకట్ రెడ్డి, మేడే రాజీవ్ సాగర్, సనత్ నగర్ కార్పొరేటర్ కొలన్ లక్ష్మీ బాల్ రెడ్డి లతో కలిసి సనత్ నగర్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సనత్ నగర్ లోని DNM కాలనీ నుండి అశోక్ కాలనీ, వెల్ఫేర్ గ్రౌండ్, శ్యామల కుంట, ఉదయ్ నగర్ తదితర ప్రాంతాల మీదుగా 60 ఫీట్ రోడ్డు వరకు ప్రచారం నిర్వహించారు. దారిపొడవునా ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు శాలువాలు, పూలమాలలతో స్వాగతం పలికారు. సనత్ నగర్ బస్టాండ్ వద్ద పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారని, అందుకే అసెంబ్లీ ఎన్నికల లలో BRS పార్టీకి బ్రహ్మరథం పట్టారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో BRS పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి ఏనాడు నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో BJP కి బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రచారంలో సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ BRS అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు ఖలీల్, సురేష్ గౌడ్, కరీం లాలా, ఫాజిల్, నోమాన్, పి. శేఖర్, రాజేష్ ముదిరాజ్, అశోక్ యాదవ్, శ్రీహరి, భూపాల్ రెడ్డి, ఆకుల రాజు, కుమార్, వనం శ్రీనివాస్, శ్యామ్ సన్, జమీర్, పుష్పాలత, సరిత గౌడ్,
కేంద్రమంత్రి గా సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలకు ఏం మేలు చేశారో చెప్పగలరా అని కిషన్ రెడ్డి
Related Posts
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సర్వేనెంబర్ 58 నుండి 226 వరకు రిజిస్ట్రేషన్లు
SAKSHITHA NEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సర్వేనెంబర్ 58 నుండి 226 వరకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరనకు కృషి చేసిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కి బిల్డర్లు కృతజ్ఞతలు తెలిపారు. కుత్బుల్లాపూర్ టౌన్ పరిధిలో అక్కడక్కడ వక్ఫ్ బోర్డ్ స్థలాల నెపం…
ఇంటి అనుమతుల విషయంలో అధికారులు
SAKSHITHA NEWS ఇంటి అనుమతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్… గాజుల రామారం సర్కిల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో…